Begin typing your search above and press return to search.

కంచెకు ప‌న్ను మిన‌హాయించండి

By:  Tupaki Desk   |   29 Oct 2015 3:48 AM GMT
కంచెకు ప‌న్ను మిన‌హాయించండి
X
క్రిష్ అలియాస్ రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కించిన లేటెస్ట్ వెంచ‌ర్ కంచె. వ‌రుణ్‌ తేజ్ హీరోగా న‌టించాడు. ఇటీవ‌లి కాలంలో రిలీజైన సినిమాల్లో ఓ డిఫ‌రెంట్ ఎటెంప్ట్ అన్న టాక్ తెచ్చుకుంది. రెండో ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంలో ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని చెప్పాడు క్రిష్‌. అంత‌కుమించి ఈ సినిమాలో స‌నాత‌న కాలంలో కులాల ర‌చ్చ ఎలా ఉండేది అన్న‌ది ట‌చ్ చేశాడు.

ఇప్ప‌టికీ కులం - మతం - ప్రాంతం పేరుతో మ‌నుషుల మ‌ధ్య ఎలాంటి లొల్లి న‌డుస్తోందో తెర‌పై చూపించాడు. ఎవ‌రినీ ప్ర‌త్యేకించి కించ‌ప‌ర‌చ‌కుండా ఎక్క‌డ ఎలా చుర‌క‌లు వేయాలో అలా వేశాడు. అందుకే ఈ సినిమాని ఇక‌ముందు జ‌ర‌గ‌బోతున్న జాతీయ‌ - అంత‌ర్జాతీయ ఫిలింఫెస్టివ‌ల్స్‌ కి పంపించ‌నున్నారు. అందుకు క్రిష్ సైతం సిద్ధంగా ఉన్నాడు. ప్ర‌స్తుతానికి ఓవ‌ర్సీస్ స‌హా అన్నిచోట్లా చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంది. ఈ క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నా. మునుముందు ఫిలింఫెస్టివ‌ల్స్‌ లో ప్ర‌ద‌ర్శ‌న‌ల గురించి ఆలోచిస్తాను... అని క్రిష్ అన్నాడు.

అంతేకాదు.. కులాల్ని ఏకేస్తూ ఓ చ‌క్క‌ని సందేశాన్ని అందించాడు కాబ‌ట్టి ఇది ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన సినిమా కూడా. రుద్ర‌మ‌దేవి కి ఇచ్చిన‌ట్టే ఈ సినిమాకి ప‌న్ను మిన‌హాయింపులు ఇవ్వాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. క్రిష్ త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వాధీశుల్ని క‌లిసి ప‌న్ను మిన‌హాయించాల్సిందిగా కోర‌తాన‌ని అన్నాడు. కంచె అందుకు అర్హ‌త ఉన్న సినిమా. ఏం చేస్తారో చూడాలి.