Begin typing your search above and press return to search.
క్రిష్ భార్యకు ‘కంచె’ ఇష్టం లేకపోయినా..
By: Tupaki Desk | 21 Jan 2017 10:44 AM GMTక్రిష్ దర్శకుడై దశాబ్దం దాటింది. తొలి సినిమాతోనే గొప్ప పేరు సంపాదించి దర్శకుడిగా స్థిరపడ్డప్పటికీ పెళ్లి ఊసు ఎత్తలేదు క్రిష్. కొంచెం లేటుగా.. అది కూడా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉంటూ తన భార్యకు కూడా పెద్దగా సమయం కేటాయించలేదు. ఈ విషయంలో రమ్య లాంటి భార్య దొరకడం తన అదృష్టం అంటున్నాడు క్రిష్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించి తన భార్య ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా స్పెషల్ అని చెబుతూ.. తన సినిమాల విషయంలో తన భార్య అభిప్రాయాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు క్రిష్.
‘‘గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సందర్భంగా బాలయ్య గారికి యాక్సిడెంట్స్ అయ్యాయి. అలాగే నాక్కూడా ఒక యాక్సిడెంట్ అయింది. అదే.. రమ్యతో నా పెళ్లి. రమ్య లాంటి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం. పెళ్లయిన ఎనిమిదో రోజుకే నేను తిరిగి శాతకర్ణి షూటింగుకి వచ్చేశాను. అయినా నా భార్య ఎలాంటి కంప్లైంట్ చేయలేదు. సినిమా చూశాక ఆమె గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇన్నాళ్లు వెయిట్ చేసినందుకు.. నాకు దూరంగా ఉన్నందుకు సరైన ఫలితమే వచ్చిందని చెప్పింది. ఆమె ఇంతకుముందు నా సినిమాలన్నీ చూసిందట. ఐతే ‘కంచె’ సినిమా మాత్రం అయిష్టంగానే చూసినట్లు తెలిపింది. తనకు స్వతహాగా కామెడీ.. హార్రర్ సినిమాలు ఇష్టమట. ‘కంచె’ రిలీజైన టైంలోనే ‘రాజుగారి గది’ సినిమా రిలీజైతే.. దానికే ప్రిఫరెన్స్ ఇచ్చిందట. తన తల్లి ‘కంచె’ సినిమాకు వెళ్దామన్నా వినలేదట. ఐతే థియేటర్ దగ్గరికెళ్తే ‘రాజుగారి గది’కి టికెట్లు దొరక్కపోవడంతో కంచె చూసిందట. కానీ ఆ సినిమా ఆమెకు నచ్చింది’’ అని క్రిష్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/