Begin typing your search above and press return to search.
కృష్ణ జన్మదినం స్పెషల్....ఆయుష్ హోమం
By: Tupaki Desk | 30 May 2017 5:15 PM ISTసూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు వినూత్న రీతిలో పుట్టిన రోజు వేడుకలను జరిపేందుకు సిద్ధమయ్యారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజున ప్రత్యేకంగా ఆయూష్ హోమం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా విభిన్నమైన రీతిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నది...విజయవాడ కృష్ణలంకకు చెందిన సూపర్ స్టార్ అభిమానులు. ఈ మేరకు అభిమానులు ఆహ్వాన పత్రికను సినీ ప్రముఖుడు బీఏ రాజు తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ 75వ జన్మదినం సందర్భంగా మే 31న ఉదయం 9.30 గంటలకు కృష్ణలంక నల్లగేటు శంకరమఠం నందు తుమ్మలపల్లి ప్రకాశ్ శర్మచే ఆయుష్ హోమం చేస్తున్నామని..అందరికీ ఇదే ఆహ్వానమని సూపర్ స్టార్ అభిమానులు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు సైతం ముద్రించారు. ఇలా ముద్రించిన ఓ పత్రిక ఇమేజ్‌ను ట్వీట్ చేస్తూ సూపర్‌స్టార్ జన్మదిన కార్యక్రమాల గురించి బీఏ రాజు వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/