Begin typing your search above and press return to search.
సంక్రాంతి సినిమాలకు సెటైరా?
By: Tupaki Desk | 26 Jan 2016 11:30 AM GMTఆ మధ్య బెంగాల్ టైగర్ - సైజ్ జీరో - శంకరాభరణం సినిమాల నిర్మాతలు ముగ్గురూ కలిసి మ్యూచువల్ అగ్రిమెంట్ తో తమ సినిమాల రిలీజ్ డేట్లను సర్దుబాటు చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. నవంబరు 27న ‘సైజ్ జీరో’ విడుదల కాగా.. డిసెంబరు 4న శంకరాభరణం వచ్చింది. బెంగాల్ టైగర్ డిసెంబరు 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఇలాంటి అగ్రిమెంటే ముగ్గురు నిర్మాతల మధ్య జరిగింది. ఫిబ్రవరి 5న ఒకేసారి కొట్టేసుకోవడానికి రెడీ అయిన ముగ్గురు నిర్మాతలు.. ఆ తర్వాత మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో మూడు వేర్వేరు శుక్రవారాల్లో రావడానికి నిర్ణయించుకున్నారు. నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ - సునీల్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణాష్టమి’ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ ‘స్పీడున్నోడు’ ఫిబ్రవరి 5న విడుదలకు ముహూర్తం చూసుకున్నాయి.
ఐతే ఫిబ్రవరి అంటే అసలే అన్ సీజన్. ఇలా పోటీకి దిగితే మూడు సినిమాలకే నష్టం కాబట్టి.. ముగ్గురు నిర్మాతలూ కలిసి ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారు. దీని ప్రకారం ముందు 5వ తారీఖున ‘స్పీడున్నోడు’ రిలీజవుతుంది. ఆ తర్వాత 12న ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వస్తుంది. చివరగా 19న ‘కృష్ణాష్టమి’ విడుదల చేస్తారు. ఈ అండర్ స్టాండింగ్ చూస్తుంటే సంక్రాంతి సినిమాల వార్ గుర్తుకురాక మానదు. ఆ సినిమాలు కూడా ఇలా అండర్ స్టాండింగ్ కు వచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఆ సినిమాల నిర్మాతలకు సెటైరా అన్నట్లు ఇప్పుడు ముగ్గురు ప్రొడ్యూసర్లు అంగీకారానికి వచ్చారు. ఐతే ఈ ముగ్గురి బాగానే అండర్ స్టాండింగ్ బాగానే ఉంది కానీ.. వేరే వాళ్లు ఆయా తేదీల్లో పోటీకి వస్తే ఏం చేస్తారో చూడాలి మరి.