Begin typing your search above and press return to search.
మహేష్ సినిమా జడ్జ్ మెంట్ ముందే చెప్పే కృష్ణ..!
By: Tupaki Desk | 15 Nov 2022 4:04 AM GMT300 పైగా సినిమాలు తీసిన అనుభవంతో సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమా చూసిన వెంటనే ఆ సినిమా హిట్టో ఫట్టో చెప్పేస్తారు. మరీ ముఖ్యంగా మహేష్ నటించిన సినిమాలు రిలీజ్ ముందే చూసి సినిమా ఫలితం ఊహించేస్తారు. మహేష్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి అప్పటినుంచే నటన మీద ఆసక్తి కలిగించేలా చేసిన కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఐదారు సినిమాలు చేశాక స్టడీస్ కోసం కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంచారు. ఇక రాజకుమారుడుతో మహేష్ ని పర్ఫెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేశారు.
మొదట్లో మహేష్ చేసే ప్రతి సినిమా కథ విషయంలో తన ఇన్వాల్వ్ మెంట్ చూపించిన కృష్ణ స్టార్ ఇమేజ్ వచ్చాక మహేష్ కే ఆ బాధ్యత వదిలేశారు. ఇప్పటికీ మహేష్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కృష్ణ రివ్యూ ఖచ్చితంగా తీసుకుంటారు.
సినిమా రిలీజ్ ముందే స్పెషల్ ప్రీమియర్ వేసి ఆయన అభిప్రాయాలను తెలుసుకుంటారు. కృష్ణ గారు చెప్పినట్టుగానే సినిమా హిట్ అంటే హిట్.. ఫట్ అంటే ఫట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన నట వారసుడిగా రమేష్ బాబు నిలబడతాడని అనుకున్నారు కృష్ణ. అందుకే రమేష్ బాబుని డైరెక్ట్ గా హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు.
మహేష్ చేస్తున్న సినిమాల మీద కృష్ణ గారి ప్రభావం ఉంటుంది. కమర్షియల్ సినిమాలే కాదు కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మహేష్ కి కృష్ణ ఎప్పుడూ చెబుతుండేవారట. ఎప్పుడైతే కామన్ ఆడియన్ కి సినిమా నచ్చుతుందో సినిమా సక్సెస్ అవుతుందని సక్సెస్ మంత్రా మహేష్ తో షేర్ చేసుకుంటారట కృష్ణ.
రమేష్ బాబు హీరోగా ఫెయిల్ అవగా మహేష్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా మరో సూపర్ స్టార్ గా ఎదిగారు. మహేష్ ప్రతి సినిమాని కృష్ణ తప్పకుండా చూస్తారు. అంతేకాదు సినిమా విషయంలో తనకు తెలిసిన కొన్ని విషయాలను కూడా మహేష్ తో షేర్ చేసుకుంటారు.
మహేష్ మార్గదర్శకుడిగా.. మహేష్ కెరియర్ ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కృష్ణ గారే మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. తండ్రి స్పూర్తితోనే మహేష్ కూడా సినిమాలను కమిటెడ్ గా చేస్తూ కృష్ణ లెగసీని కొనసాగిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.