Begin typing your search above and press return to search.
పెళ్లి విషయాలను చెప్పిన కృష్ణ!
By: Tupaki Desk | 7 July 2019 5:30 PM GMTవిజయ నిర్మల మరణంతో సూపర్ స్టార్ కృష్ణ ఒంటరి అయ్యారు. దాదాపు 50 ఏళ్లుగా వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు. అప్పటికే పెళ్లి అయినా కూడా లోకం గురించి బెదరకుండా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదని నమ్మిన కృష్ణ అందరిని కాదని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. కృష్ణ మరియు విజయ నిర్మలల ప్రేమ మరియు పెళ్లి అప్పట్లో సంచలనంగా చెప్పుకోవాలి. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మొదటి భార్య ఇందిరా గారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న వ్యక్తి కృష్ణ.
తాజాగా విజయ నిర్మల మరణంతో ఒంటరి అయిన కృష్ణను ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. గుండెనిండా బాధతో ఉన్న ఆయన్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. ఆయన తడిసిన కళ్లతో విజయ నిర్మల మరియు తన అనుబంధం గురించి చెప్పడం జరిగింది. కృష్ణ మాట్లాడుతూ.. మేమిద్దరం మొదటి సారి బాపు గారి దర్శకత్వంలో తెరకెక్కిన 'సాక్షి' చిత్రం షూటింగ్ సెట్ లో కలిశాం. అప్పుడప్పుడే మేమిద్దరం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాం. 'సాక్షి' సినిమా సెట్స్ లో మా స్నేహం మొదలైంది. ఆ స్నేహం ప్రేమగా మారింది. 1964 మార్చి 24న మా పెళ్లి అయ్యింది. మొన్నటి మార్చికి మా పెళ్లి అయ్యి 50 ఏళ్లు పూర్తి అయ్యింది. నేను ఆమెను నిర్మలా అని పిలుస్తాను. ఆమె బయట కృష్ణ గారు అంటూ పిలిచినా ఇంట్లో మాత్రం ఏమ్మా.. అంటూ ప్రేమగా పిలిచేది. మా పెళ్లికి అప్పట్లో రాజబాబు చాలా హెల్ప్ అయ్యాడు. ఇంకా నిర్మాత భావనారాయణ గారు మా పెళ్లికి పెద్దగా నిలిచారు.
పెళ్లి చేసుకుంటే వచ్చే విమర్శల గురించి ఆలోచించలేదు. ప్రేమించుకున్నాం కనుక పెళ్లి చేసుకోవాలనుకున్నాం. చంద్రమోహన్.. రమాప్రభ.. వెంకన్న బాబు.. నిర్మాత రాఘవ.. జర్నలిస్టు కాగడ శర్మలు తిరుపతిలో జరిగిన మా పెళ్లికి సాక్షులు. పెళ్లి అయ్యాక కూడా మేమిద్దరం చాలా సినిమాల్లో కలిసి చేశాం. కొన్ని సినిమాల్లో అన్నా చెల్లి పాత్రల్లో కూడా నటించాం. మేమిద్దరం అప్పట్లో ప్రేమించుకోవడం మరియు పెళ్లి చేసుకోవడం అనేది ఇండస్ట్రీలోనే సంచలనంగా నిలిచింది అంటూ కృష్ణ గారు బరువెక్కిన గుండెతో విజయ నిర్మల గారి గుర్తులను నెమరవేసుకున్నారు.