Begin typing your search above and press return to search.
స్టార్ హీరో వారసురాలు నటనలోకి రానని తెగేసింది!
By: Tupaki Desk | 27 Aug 2021 8:30 AM GMTబాలీవుడ్ లో జాకీష్రాప్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎయిటీస్ నైన్టీస్ లో బాలీవుడ్ ని తనదైన ప్రతిభ ఛరిష్మాతో ఓ ఊపు ఊపారు. ఇప్పటికీ అదే హవాను కొనసాగిస్తున్నారు. ఆ గుర్తింపుతోనే జాకీష్రాప్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాప్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినా టైగర్ తనదైన శైలి దేశధారుడ్యంతో బాలీవుడ్ లో ఓ న్యూ ట్రెండ్ నే క్రియేట్ చేసాడు. హృతిక్ రోషన్ తర్వాత అంతటి వాడిగా.. మరో సిల్వస్టర్ స్టాలోన్ గా అతడి ఫాలోవర్స్ వర్ణిస్తున్నారు. తండ్రి తర్వాత తనయుడు తండ్రిని మించిన వాడిగా దూసుకుపోతున్నాడు. బాలీవుడ్ నటులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న టైగర్ ష్రాఫ్ కెరీర్ పరంగా ఫుల్ హ్యాపీ. అయితే జాకీష్రాప్ వారసురాలిగా ఎంట్రీ ఇవ్వడానికి కుమార్తె కృష్ణా ష్రాప్ మాత్రం ఆసక్తిని చూపించడం లేదు.
తన ప్రపంచం వేరు అని... తనే ఓ ప్రపంచాన్ని ఏర్పరుచుకుని ముందుకెళ్లిపోవడం తనకు ఇష్మని చెబుతోంది. నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమాను లకు టచ్ లో ఉండే కృష్ణా ష్రాప్ మరోసారి బాలీవుడ్ సినిమాలపై తన అయిష్టతను ప్రదర్శించింది. సినిమాల ద్వారా వచ్చే గుర్తింపుకన్నా... ప్రస్తుతం తాను జిమ్..యోగా వీడియోలతో వస్తోన్న గుర్తింపే ఎంతో నచ్చిందని... సంతృప్తినిస్తుందని తెలిపింది. తన ఎమోషన్స్ అన్నింటిని తనకు తానుగా బయటకు చెప్పుకేనే స్వేచ్చ సినిమాల ద్వారా లభించిందని..అలా ఫోకస్ అయి ఎవరో చెప్పిన దాన్ని తాను చేయడం ద్వారా తన ఇన్నర్ ఫేస్ ని కోల్పోయినట్లు అవుతుందని అభిప్రాయపడింది.
ఆ కారణంగానే వచ్చిన సినిమా అవకాశాల్ని కూడా వదులుకున్నట్లు వెల్లడిచింది. అందుకు తాను ఎప్పుడూ బాధపడలేదని.. అలాంటి ఆలోచనే తన మైండ్ లోకి రానివ్వనని తెలిపింది. మొత్తానికి కృష్ణా ష్రాప్! ఫాదర్.. బ్రదర్ అనుసరిస్తున్న ఐడియాలజీకి పూర్తి భిన్నమని భావించాలి. ఇక ఇన్ స్టాలో కృష్ణా ష్రాప్ హాటెస్ట్ ఫోటోషూట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హాట్ ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు చెలరేగిపోతూనే ఉంటుంది ఈ బ్యూటీ.