Begin typing your search above and press return to search.
నాకు లైఫ్ ఇచ్చింది ఆ ఇద్దరే- కృష్ణ
By: Tupaki Desk | 19 Feb 2016 4:19 AM GMTసూపర్ స్టార్ కృష్ణ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేశారు. నాలుగు దశాబ్దాల పాటు అలుపెరగకుండా నటించి.. ఐదారేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ‘శ్రీ శ్రీ’ అనే సినిమా చేశారు. ఓ మరాఠీ హిట్ సినిమా ఆధారంగా సీనియర్ డైరెక్టర్ ముప్పలనేని శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శుక్రవారం రాత్రి శిల్ప కళావేదికలో ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేశారు. కృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కూడా పూర్తయిన నేపథ్యంలో ఇదే వేదికపై ఆయన్ని ఘనంగా సత్కరించారు సినీ ప్రముఖులు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘‘నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సమయంలో ఈ వేదికపై నన్ను సత్కరించినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ఒకరు ‘తేనె మనసులు’ సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావుగారు. రెండో వ్యక్తి ‘గూఢచారి 116’ సినిమాతో నాకు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన నిర్మాత డూండీ గారు. ఇప్పుడు నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకునే బలాన్ని ‘గూఢచారి 116 సినిమా’ ఇచ్చింది. ఆరేడేళ్లుగా నేను సినిమాలకు దూరంగా ఉంటున్నాను. ముప్పలనేని శివ మరాఠీ సినిమాను చూపించగానే బాగా నచ్చింది. మాతృక కంటే వంద రెట్లు బాగా ఉండేలా శివ ఈ సినిమాను తీర్చిదిద్దాడు. నా కెరీర్లో ఇదొక మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
కృష్ణ సతీమణి విజయనిర్మల మాట్లాడుతూ.. ‘‘నేను, కృష్ణగారు కలిసి నటించిన 48వ సినిమా ఇది. మరో రెండు సినిమాలు చేస్తే 50 పూర్తవుతాయి. మరాఠీలో కంటే శివ గారు గొప్పగా ఈ చిత్రాన్ని తీశారు. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.