Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సినిమా

By:  Tupaki Desk   |   27 Oct 2015 1:10 PM IST
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ స్టార్ సినిమా
X
దాదాపు 350 సినిమాల్లో నటించిన ఘన చరిత్ర సూపర్ స్టార్ కృష్ణది. లేటు వయసులో కూడా వరుసబెట్టి హీరోగా సినిమాలు చేసిన కృష్ణ.. దశాబ్దం కిందట హీరో వేషాలకు స్వస్తి పలికారు. అప్పుడప్పుడూ గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చిన కృష్ణ రెండు మూడేళ్లుగా ఆ తరహా పాత్రలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఇక మళ్లీ ఆయన్ని తెర మీద చూడలేమేమో అనుకున్నారు అభిమానులు. ఐతే కృష్ణ ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. అది కూడా గెస్ట్ రోల్ కోసం కాదు. హీరో పాత్ర కోసం.

సూపర్ స్టార్ హీరోగా ‘శ్రీ శ్రీ’ పేరుతో సినిమా మొదలైంది. దసరా రోజు చడీ చప్పుడు లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టేశారు. సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తుండటం విశేషం. సాయిదీప్ చాట్ల - బాలు రెడ్డి - షేక్ సిరాజ్ అనే ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృష్ణను ఎప్పుడూ చూడని సరికొత్త అవతారంలో చూడబోతున్నారు అభిమానులు. వయసుకు తగ్గ పాత్రలో ఫ్రెంచ్ గడ్డం పెట్టుకుని తనకు నప్పే హెయిర్ స్టయిల్ తో సరికొత్తగా కనిపిస్తున్నారు కృష్ణ. సూపర్ స్టార్ సరసన ఆయన భార్య విజయనిర్మల కీలక పాత్ర పోషిస్తోంది.