Begin typing your search above and press return to search.
తన ఇమిటేషన్ ని సరదాగా తీసుకున్న కృష్ణ..!
By: Tupaki Desk | 16 Nov 2022 6:15 AM GMTతన మీద వచ్చిన సెటైర్స్ ని కూడా చాలా సరదాగా తీసుకునే వారు సూపర్ స్టార్ కృష్ణ . ఎన్.టి.ఆర్ ని టార్గెట్ చేస్తూ పద్మాలయా స్టూడియోస్ తీసిన మండలాదీశుడు, సాహసమే నా ఊపిరి వంటి సినిమాల వెనుక కృష్ణ ఉన్నారని తెలిసిందే. ఎదుటి వారిపై సెటైర్ వేయడమే కాను తన మీద వచ్చిన సెటైర్స్ కి చాలా హుందాగా ప్రవర్తించడం కృష్ణ గారికే చెల్లుతుంది. దుబాయ్ శీను సినిమాలో ఎమ్మెస్ నారాయణ పోశించిన సాల్మన్ రాజు పాత్ర కొద్దిగా కృష్ణ గారికి దగ్గరగా ఉంటుంది.
ఆ పాత్ర ఓ స్టార్ హీరోకి ఇన్ స్ప్రేషన్ అని.. డైలాగ్ డెలివరీ కృష్ణ గారి అనుకరణే అని ఆ పాత్ర చేసిన ఎమ్మెస్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఈ విషయం పై కృష్ణ తన దగ్గర ప్రస్థావించారని అన్నారు ఎమ్మెస్ రాజు. భలే చేశావయ్యా అంటూ తనపై వేసిన సెటైర్ ని కూడా చాలా సరదాగా తీసుకున్నారంటూ ఎమ్మెస్ నారాయణ చెప్పారు.
అప్పట్లో కృష్ణ డ్యాన్స్ మీద చాలా డిస్కషన్సే జరిగాయి. అయితే ఎవరేమి అనుకున్నా సరే తనకు వచ్చిన డ్యాన్స్ ని చేస్తూ వచ్చారు కృష్ణ. డైలాగ్ డెలివరీలో ఆయనకి ఆయనే సాటి. ఆయన మెమొరీ పవర్ చాలా గొప్పది.. ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. కృష్ణ గారికి మాస్ ఇమేజ్ తెప్పించింది ఆయన డైలాగ్ డెలివరీ.. ఎమోషన్, యాక్షన్ సీన్స్ లో ఆయన డైలాగ్స్ థియేటర్ లో ఫ్యాన్స్ ని విజిల్స్ వేసేలా చేశాయి.
తానో పెద్ద హీరో అయినా కూడా తన మీద కామెడీగా సెటైర్ వేస్తే.. దాన్ని పెద్ద సీన్ చేయొచ్చు కానీ దాన్ని కూడా చాలా పాజిటివ్ గా తీసుకుని ఆ పాత్రని వేసిన నటుడిని కూడా మెచ్చుకోవడం కృష్ణ గారికే చెల్లుతుంది. కృష్ణ మంచి మనసు గురించి చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదహరణ అని చెప్పొచ్చు.
తన సినిమాలతో సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వచ్చారు నట శేఖరుడు కృష్ణ. తెలుగులో కొత్త దర్శకులకు.. కొత్త నిర్మాతలకు అవకాశం ఇచ్చారు కృష్ణ. నిర్మాతల హీరో ఆయన. సినిమాలు హిట్ అవుతున్నాయ్ కదా అని రెమ్యునరేషన్ పెంచకుండా నిర్మాతలు ఇచ్చినంత తీసుకునే వారు. అంతేకాదు ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాతకు మరో సినిమా ఫ్రీగా చేసి పెట్టేవారు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ మంచి మనిషి.. మహా మనిషి అని అందరు అంటుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.