Begin typing your search above and press return to search.

ర‌మ్య‌కృష్ణ చికెన్ వండ‌టంలో స్పెష‌లిస్ట్!

By:  Tupaki Desk   |   27 March 2023 7:00 AM GMT
ర‌మ్య‌కృష్ణ చికెన్ వండ‌టంలో స్పెష‌లిస్ట్!
X
'రంగ‌మార్తాండ' స‌క్సెస్ తో అందులో న‌టించిన న‌టీన‌టులంతా హైలైట్ అవుతున్నారు. రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ రావ‌డం..రిలీజ్ త‌ర్వాత అంత‌కు మించి వైర‌ల్ అవ్వ‌డంతో ఎక్క‌డ చూసిన 'రంగ‌మా ర్తాండ' పాత్ర‌ల గురించే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది. ద‌ర్శ‌కుడిగా కృష్ణ‌వంశీ పేరు మ‌రోసారి నెట్టింట మారు మ్రోగిపోతుంది. వాళ్లు ఊహించిన దానికంటే సినిమా పెద్ద స‌క్సెస్ అయింద‌న‌డానికి ఈ సంకేతాలు చాలు.

బాక్సాఫీస్ లెక్క‌లు ప‌క్క‌న‌బెడితే! వంశీ ఇంకొన్న పాళ్లు ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగ‌తారు అని చెప్పొచ్చు. తాజాగా కృష్ణ‌వంశీకి ఇష్ట‌మైన వంట‌కాల గురించి ప్ర‌శ్నిస్తే ఆయ‌న మంచి నాన్ వెజ్ ప్రియుడు అని తేలింది.

కొర్ర‌మీనులు అంటే ఇష్ట‌మ‌ట‌. ఆ చేప పులుసు..ఇగురు అంటే ఇష్టంగా తింటారుట‌. అలాగే రమ్య‌కృష్ణ చికెన్ వండ‌టంలో స్పెష‌లిస్ట్ అట‌. చికెన్ చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తుందిట‌.

అప్పుడ‌ప్పుడు వంట‌కాలు చేసినా అవి ఎంతో రుచిగా ఉంటాయ‌ట‌. వంట‌పై ఎంతో ఇష్టంతో చేస్తుంది కాబ‌ట్టే అంత రుచి వ‌స్తుంద‌న్నారు. మొత్తానికి ర‌మ్య‌కృష్ణ కూడా మంచి నాన్ వెజ్ ప్రియురాల‌ని ఈ సంద‌ర్భంగా గెస్ చేయోచ్చు. మ‌రి వండ‌టం వ‌ర‌కేనా? లేక వాటిని రుచి చూడ‌టంలోనూ మంచి పుడ్డీనే నా? అన్న‌ది తెలియాలి. 'రంగ‌మార్తాండ' కార‌ణంగానే ఈ విష‌యాల‌న్ని వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఆ సినిమాలో గ‌నుక ర‌మ్య‌కృష్ణ న‌టించ‌క‌పోయి ఉంటే? ఇన్ని సంగ‌తులు తెలిసేవి కాదు. సినిమాలో కూడా ఆమె అనుకోకుండా భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక టాలీవుడ్ హీరోల్లో నాన్ వెజ్ ప్రియులంటే డార్లింగ్ ప్ర‌భాస్ పేరు ముందుగా వినిపిస్తుంది.

ప్ర‌పంచంలో అన్ని ర‌కాల నాన్ వెజ్ వంట‌కాలు రుచి చూసిన ఘ‌నుడాయ‌న‌. ముక్క లేనిదే ముద్ద దిగ‌దు. త‌న స‌హ‌చ‌రుల‌కు అలాగే ద‌గ్గ‌రుండి మ‌రీ తినిపిస్తాడు. ఈ అల‌వాటు రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు నుంచే ప్ర‌భాస్ కి వ‌చ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.