Begin typing your search above and press return to search.
కృష్ణవంశీని ఆ నిర్మాత అలా ముంచారట!
By: Tupaki Desk | 1 Aug 2016 8:25 AM GMTతనమార్కు సినిమాలతో సంచలనాలు సృష్టించే క్రియేటివి డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఒక నిర్మాతపై సంచలనవ్యాఖ్యలు చేశారు. సాధారణంగా నిర్మాతలు డబ్బులు ఎగ్గొట్టిన సందర్భాల్లో ఆయా హీరోలు - దర్శకులు మీడియా ముందుకు వచ్చిన చెడామడా తిట్టిపారేయడం - లేదంటే అసోషియేషన్ లో పంచాయితీ పెట్టి తేల్చుకోవడం జరుగుతుంటాయి. ఇదే విషయాలపై తాజాగా కృష్ణవంశీ స్పందించాడు. ఆ నిర్మాతను ఏకవచనంతో సంబోదించడమే కాకుండా.. డైరెక్టుగా కడిగేశాడు.
వివరాళ్లోకి వెళితే.. అప్పట్లో ఒక సినిమాకు సంబంధించి కృష్ణవంశీని ఒక నిర్మాత మోసం చేశాడట. తనకు పారితోషకం ఇవ్వకపోగా.. తనవద్దే ఎదురు డబ్బులు తీసుకుని మోసం చేశాడట. ఇది ఒక నిర్మాత వ్యవహారమైతే.. మరో నిర్మాత అయితే ఏకంగా రూ. 4 కోట్లకు మోసం చేశాడట. ఈ విషయాలపై స్పందించిన కృష్ణవంశీ.. తాను మోసపోతున్నానని తెలిసి కూడా ఊరుకే ఉండి మోసపోయాయని చెప్పుకొచ్చారు.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన కెరీర్ లో ఎవరెవరి చేతిలో మోసపోయారో చెప్పడం మొదలెపెట్టిన క్రియేటివ్ డైరెక్టర్... "ఒకడు తన నాలుగేళ్ల కూతురి పై ఒట్టేసి నాతో సినిమా చేయించుకున్నాడు. తీరా సినిమా పూర్తయ్యాక రూ.4 కోట్లకు టెండర్ పెట్టాడు. వాడు అబద్ధమాడుతున్నాడని.. మోసం చేస్తున్నాడని తెలిసినా కూడా సెంటిమెంటుకి కమిటయ్యాను. ఆ రూ. 4 కోట్ల మోసం వల్ల నేనేమీ రోడ్డు మీద పడిపోలేదు. వాడేమీ అంబానీ అయిపోలేదు.. జన్మలో ఇక వాడితో మళ్లీ సినిమా చేయను. మరొకడైతే.. నాకు పారితోషకం ఇవ్వకపోగా.. తిరిగి తనవద్దే డబ్బులు తీసుకుని మరీ ఎగ్గొట్టాడు".ఈ రేంజ్ లో కృష్ణవంశీ ఒక నిర్మాతపై స్పందించేసరికి.. ప్రస్తుతం సినిమా జనాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరబ్బా? అని తెగ చర్చించేసుకుంటున్నారు సినీ జనాలు!