Begin typing your search above and press return to search.
రివ్యూ రైటర్ల తెలివి అక్కడ పెట్టుకోండి
By: Tupaki Desk | 17 Nov 2016 5:30 PM GMTటాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆన్ లైన్ రివ్యూలపై విమర్శలు గుప్పించడం ఎప్పటి నుంచో ఉంది. సినిమాలో ఉన్న లోటుపాట్లను ప్రస్తావిస్తున్న రివ్యూలు.. ఇప్పుడు మూవీ చూడాలా వద్దా అని వ్యూయర్ నిర్ణయించుకునేందుకు ఆధారం అయిపోయాయి. ఒకట్రెండు మినహాయిస్తే.. దాదాపు రివ్యూల ఆధారంగానే రిజల్ట్ నడుస్తోంది.
దీంతో సినిమా మేకర్స్ రివ్యూలపైనా.. రివ్యూల రైటర్లపై.. కస్సుబుస్సు మంటూ ఉంటారు. ఇప్పుడీ జాబితాలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా చేరిపోయాడు. రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రివ్యూ రైటర్లను ఉద్దేశించి విమర్శలు గుప్పిచండమే కాదు.. ఏకంగా వాళ్ల తెలివితేటలను ఎక్కడో పెట్టాలని కూడా అనేశాడు.
"ప్రస్తుతం చాలామంది రివ్యూయర్లకు సినిమా మేకింగ్ పై కనీస మాత్రం నాలెడ్జ్ కూడా ఉండడం లేదు. విమర్శలో ఉన్న కళ ఏంటో వాళ్లకు తెలియదు. కానీ స్క్రీన్ ప్లే.. కేరక్టరైజేషన్ గురించి ఇష్టంవచ్చినట్లు రాయగలరు. వాళ్లందరూ తమ తెలివితేటలను తీసుకెళ్ళి యా** లో పెట్టుకోండి" అన్నాడు కృష్ణవంశీ.
ఆన్ లైన్ లో రివ్యూలను ప్రచురించేందుకు సినిమా రిలీజ్ నుంచి కనీసం వారం వ్యవధి ఉండాలని.. అంతే తప్ప రివ్యూ రైటర్ల అభిప్రాయాలను ప్రేక్షకులపై రుద్దకూడదని విరుచుకుపడ్డాడీ క్రియేటివ్ డైరెక్టర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/