Begin typing your search above and press return to search.
హిట్టు కోసం సినిమాలు తీయలేదట!
By: Tupaki Desk | 6 July 2022 2:30 AM GMTచాలా మంది దర్శకులు బ్లాక్ బస్టర్ హిట్ కోసమే సినిమాలు తీశామని చెబుతుంటారు. కానీ ఒక దర్శకుడు మాత్రం తాను హిట్టు కోసం సినిమాలు తీయలేదని బాహాటంగా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆయనే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. `గులాబి` చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన కృష్ణవంశీ తనదైన మార్కు చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నిన్నే పెళ్లాడతా, సిందూరం, మురారి, ఖడ్గం వంటి సినిమాలని అందించారు.
బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా వున్న కృష్ణవంశీ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకత ఏర్పడింది. దాన్ని ఎక్కడా మిస్ అవ్వకుండా ఆయన సినిమాలు చేస్తూ వచ్చారు.
అయితే `మహాత్మ` నుంచి ఆయన సినిమాలు గాడి తప్పాయి. సున్నితమైన కుటుంబ భావోద్వేగాల సమాహారంగా సినిమాలని తెరకెక్కిస్తూ వచ్చిన ఆయన తప పట్టుకోల్నోయారు. దాదపు పదేళ్లుగా కృష్ణవంశీ ఒక్కటంటే ఒక్క సక్సెస్ ఫుల్ మూవీని అందించలేకపోయారు.
నాలుగేళ్ల విరామం తరువాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `రంగమార్తాండ`. మారాఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ నటించిన `నట సామ్రాట్` ఆధారంగా ఈ మూవీని తెలుగులో కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీని పూర్తి చేయడం కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిరంజీవి ఈ మూవీకి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఇదిలా వుంటే ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కృష్ణవంశీ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. హిట్టు కోసం తాను సినిమాలు చేయలేదని చెప్పి షాకిచ్చారు.
గురువు వర్మ తరహాలోనే స్పందించారు. నేను చెబితే జనాలకు ఎలా వుంటుందో తెలియదు కానీ నేను మాత్రం హిట్టు కోసం సినిమాలు చేయలేదన్నారు. సినిమా తీసిన తరువాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనేకునేవాడినన్నారు. హిట్ కోసమే సినిమా తీయాలంటే అప్పుడు మార్కెట్ లో వున్న హిట్ ఫార్ములాని ఫాలో అవుతూ సినిమాని చేయాల్సి వుంటుంది. అప్పుడని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందే కానీ మేకింగ్ అనిపించుకోదన్నారు. హిట్టు కోసమే సినిమాలు చేస్తే థ్రిల్లర్ సినిమానో లేక హీరో ఓరియెంటెడ్ సినిమానో చేస్తాను కానీ `రంగమార్తాండ` ఎందుకు చేస్తాను.. నా అనుభవంలో అర్థమైంది ఏంటంటే ఎవరూ హిట్ సినిమాలు తీయలేరు తీసిన సినిమాలు హిట్ అవుతాయి అంతే అన్నారు. కృష్ణవంశీ అన్నమాటలు ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి.