Begin typing your search above and press return to search.
అరుంధతి లాంటి సినిమా చెక్కుతాడట
By: Tupaki Desk | 5 April 2018 9:14 AM GMTడైరెక్టర్ కృష్ణవంశీ హిట్ కొట్టి చాలారోజులై పోతోంది. ఎన్ని జోనర్లు మార్చి సినిమాలు తీసినా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడం తప్ప నాలుగు రోజులు నిలకడగా ఆడి కలెక్షన్లు రాబట్టిన దాఖలాలు కరవైపోయాయి. లేటెస్ట్ గా కృష్ణవంశీ ఎంతో ఆశలు పెట్టుకుని నక్షత్రం తెరకెక్కించాడు. భారీ కాస్టింగ్ తో సినిమా తీసినా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
తిరిగి డైరెక్టర్ గా తన సత్తా చాటుకునేందుకు కృష్ణవంశీ ఇంతవరకు తను టచ్ చేయని జోనర్ లో సినిమా తీయాలని అనుకుంటున్నాడట. అందుకే హర్రర్ సినిమా తీయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదేమీ తక్కువ కాస్ట్ లో అయిపోయే హర్రర్ కామెడీ కాదు. అరుంధతిని తలదన్నే భారీ హర్రర్ ఫిలిం తీయాలన్నది కృష్ణ వంశీ ప్లాన్. దీని బడ్జెట్ దాదాపు రూ. 40 కోట్ల పైమాటే అవుతుందని లెక్క కడుతున్నారు. కృష్ణవంశీ కెరీర్ లోనే కాదు.. హర్రర్ ఫిలిం జోనర్ లోనే ఇది మోస్ట్ కాస్ట్ లీ మూవీ అన్నమాట.
కృష్ణవంశీ ఇంత భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేయడం వరకు బాగానే ఉంది కానీ.. అంత పెట్టుబడి పెట్టే నిర్మాత ఎక్కడ దొరుకుతాడన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఆయన డైరెక్షన్ లో చేసిన నటులకు పేరొస్తున్నా నిర్మాతల జేబులు మాత్రం ఖాళీ అయిపోతున్నాయి. బడ్జెట్టే రూ. 40 కోట్లు దాటిపోతే.. కనీసం రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాకపోతే నిర్మాతకు మిగిలేదేం ఉండదు. మరి ఏ ప్రొడ్యూసర్ ఇంత సాహసం చేస్తాడో చూడాలి.