Begin typing your search above and press return to search.

క్యాన్స‌ర్ తో నాటి టాప్ హీరోయిన్ అస్వ‌స్థ‌త‌

By:  Tupaki Desk   |   19 April 2017 7:46 AM GMT
క్యాన్స‌ర్ తో నాటి టాప్ హీరోయిన్  అస్వ‌స్థ‌త‌
X
ఇప్ప‌టివారికి సుప‌రిచితం కాదు కానీ.. పాత సినిమాలు చూసే వారికి.. అర‌వై.. డెబ్భైల నాటి సినిమాల‌తో అనుబంధం ఉన్న వారికి సుప‌రిచితురాలు టి.కృష్ణ కుమారి. త‌న అందంతో నాటి యువ‌త మ‌న‌సును దోచుకున్న ఆమె.. అప్ప‌ట్లో ఒక వెలుగు వెలిగారు. టాప్ హీరోయిన్ గా పేరు ప్ర‌ఖ్యాతులు సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు క్యాన్స‌ర్ వ్యాధితో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు అంటే 1933 మార్చి ఆరున పుట్టిన ఆమెకు ఇప్పుడు 84 సంవ‌త్స‌రాలు. ముదిమి వ‌య‌సులో ఉన్న నాటి టాప్ హీరోయిన్ ఇప్పుడు బోన్ మ్యారో క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. కొన్ని వారాల క్రితం ఆమెకు క్యాన్స‌ర్ సోకిన‌ట్లుగా గుర్తించారు.

ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు.. పెద్ద ఎత్తున ఓ పాజిటివ్ ర‌క్తం అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. కీమోథెర‌పికీ ఆమె శ‌రీరంగా చ‌క్క‌గా స్పందిస్తుంద‌ని చెబుతున్నారు. తెలుగువారికి సుప‌రిచితురాలైన షావుకారి జాన‌కి.. కృష్ణ‌కుమారి పెద్ద‌క్క‌. ఈ మ‌ధ్య‌నే ఆమె వెంక‌టేశ్ బాబు బంగారం చిత్రంలో న‌టించారు.

ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ ఎడిట‌ర్ అజ‌య్ ఖైతాన్‌ ను పెళ్లి చేసుకున్న కృష్ణ‌కుమారి.. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉండిపోయారు. బెంగ‌ళూరులో స్థిర‌ప‌డ్డ ఆమె సినిమాల‌కు దూరంగా ఉండిపోయారు. ఐదేళ్ల కింద‌ట ఆమె భ‌ర్త మ‌ర‌ణించారు. ప్రస్తుతం ఆమె కుమార్తె ర‌చ‌యిత్రి దీపిక ద‌గ్గ‌ర ఉంటున్నారు. త‌న కెరీర్‌ లో 150 తెలుగు సినిమాలు.. 30 త‌మిళ‌.. క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన కృష్ణ‌కుమారి.. నాటి అగ్ర క‌థానాయ‌కులు అంద‌రి స‌ర‌స‌న న‌టించారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని.. ఆరోగ్యం పూర్తిగా న‌యం కావాల‌ని ఆశిద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/