Begin typing your search above and press return to search.

ఈసారి పెళ్లి గ్యారెంటీ అంటున్న పెదనాన్న

By:  Tupaki Desk   |   20 Jan 2019 11:35 AM GMT
ఈసారి పెళ్లి గ్యారెంటీ అంటున్న పెదనాన్న
X
'బాహుబలి' చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి కూడా ప్రభాస్‌ పెళ్లి గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. బాహుబలి చాలా పెద్ద ప్రాజెక్ట్‌, ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటూ అప్పట్లో ప్రభాస్‌ చెప్పాడు. బాహుబలి కాస్త దాదాపు అయిదు సంవత్సరాలు పట్టింది. బాహుబలి మొదటి పార్ట్‌ విడుదలైన వెంటనే ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే రెండవ పార్ట్‌ కూడా పూర్తి చేసిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ ప్రభాస్‌ ఆమద్య చెప్పాడు. బాహుబలి 2 విడుదలైన వెంటనే ప్రభాస్‌ 'సాహో'ను షురూ చేశాడు.

'సాహో' కూడా భారీ ప్రాజెక్ట్‌ అవ్వడంతో ప్రభాస్‌ పెళ్లి ఇప్పట్లో అయ్యేలా లేదని అభిమానులు కూడా ఆశలు వదులుకున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ పెళ్లి గురించి చర్చ మొదలైంది. నేడు కృష్ణం రాజు పుట్టిన రోజు, ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా ప్రభాస్‌ పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. 'సాహో' విడుదలైన వెంటనే ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈసారి తప్పకుండా ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని కృష్ణం రాజు నమ్మకంగా చెప్పారు.

'సాహో' చిత్రం ఈ ఏడాది దసరా వరకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి. అంటే ఈ ఏడాదిలో పెళ్లి నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ప్రభాస్‌ పెళ్లి కన్ఫర్మ్‌ గా ఉండవచ్చు అనేది మీడియా వర్గాల వారి అంచనా. ఇక ప్రభాస్‌ తో తన బ్యానర్‌ లో ఒక లవ్‌ స్టోరీ చిత్రాన్ని నిర్మించబోతున్నానని, ఆ చిత్రంలో తాను కూడా నటిస్తానని కృష్ణం రాజు పేర్కొన్నాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఆదేశిస్తే పోటీ విషయమై ఆలోచిస్తానని కూడా కృష్ణంరాజు అన్నారు.