Begin typing your search above and press return to search.

రాజు గారు సభ్యులను చేస్తున్నారటగా..

By:  Tupaki Desk   |   20 July 2016 10:18 AM GMT
రాజు గారు సభ్యులను చేస్తున్నారటగా..
X
ఈసారి మనం మాట్లాడుతోంది సీనియర్‌ రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారి గురించి. ఇప్పుడు ఆయన తనకు కావల్సిన వారికి సెన్సార్‌ బోర్డులో సభ్యత్వం ఇప్పిస్తున్నారని ఒక టాక్ నడుస్తోంది. అయితే ఈ సభ్యత్వంతో బోర్డు సభ్యులు సినిమాలను సెన్సార్ చేయడమే తప్పించి ఇంకేమీ చేయరు కాని.. కృష్ణంరాజు గారి రికమండేషన్లు అంటూ మీడియాలో దద్దరిల్లిపోతోంది ఇప్పుడు.

ఎప్పటినుండో కృష్ణంరాజు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడంటుగా చేస్తున్నారు శ్రీరామచంద్ర శాస్త్రి. సాఫ్టువేర్ ఇంజనీర్ అయిన ఈయన కూతురు లక్ష్మీ అపర్ణ ఇప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్ గా ఎప్పాయింట్ అయ్యారు. అయితే స్వయంగా కృష్ణంరాజు పూనుకుని.. బిజెపి అధిష్టానానికి రికమండ్ చేయడం వలనే ఈ పోస్టు ఇచ్చారంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి. సర్లేండి మనలో మనమాట.. సెన్సార్ బోర్డు మెంబర్ అంటే అదేమన్నా దేశాన్ని శాసించే పోస్టా లేకపోతే బీభత్సంగా డబ్బులొచ్చే పోస్టా? ఏదో సరదాగా సినిమాలను రివ్యూ చేస్తూ.. చూసిన సినిమాపై ఒపీనియన్ అందించి సర్టిఫికేషన్ ఇచ్చే టీములో ఒక భాగం అవుతారంతే. ఒక విధంగా సొసైటీకి చేసే చిన్న సేవ అనుకోండి. కాకపోతే రాజు గారు రికమండ్ చేశారని అనేసరికి ఇది పెద్ద న్యూస్ అయిపోయింది.

ఇకపోతే కృష్ణంరాజు ఇంతకీ ప్రభాస్‌ ను డైరక్టు చేస్తున్నారా లేదా? ఆ విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.