Begin typing your search above and press return to search.
ఆ బయోపిక్ పై రెబల్ స్టార్ మనసులో మాట
By: Tupaki Desk | 21 Jan 2019 8:10 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ లు వస్తున్న విషయం తెల్సిందే. 'మహానటి' చిత్రంతో సావిత్రి జీవితాన్ని తెలుగు ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. తాజాగా 'ఎన్టీఆర్' బయోపిక్ కూడా వచ్చింది. త్వరలో రెండవ పార్ట్ కూడా రాబోతుంది. ఈ క్రమంలోనే ఇంకా పలు బయోపిక్ ల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఎస్వీ రంగారావు బయోపిక్ గురించి రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 50 ఏళ్లు అయిన సందర్బంగా కృష్ణం రాజు మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వేడుక జరిపారు.
కృష్ణంరాజు మీడియా మాట్లాడుతూ తనకు ఈమద్య కాలంలో నచ్చిన చిత్రం 'మహానటి' అని, ఆ చిత్రం చాలా అద్బుతంగా తెరకెక్కించారని అన్నారు. ఎస్వీ రంగరావు బయోపిక్ తీస్తే బాగుంటుందని, ఆ బయోపిక్ లో ఎస్వీఆర్ పాత్రను ప్రకాష్ రాజ్ పోషిస్తే బాగుంటుందని కూడా అన్నాడు. ఎస్వీఆర్ ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించి స్టార్ గా ఎదిగారు. ఎస్వీఆర్ తర్వాత అంతటి స్థాయి ఎవరికి కూడా టాలీవుడ్ లో రాలేదు. ప్రకాష్ రాజ్ అయితే ఆ పాత్రకు తప్పకుండా న్యాయం చేస్తాడని కృష్ణం రాజు అన్నారు.
ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ ల గురించి ప్రచారం అయితే జరిగింది. కాని ఎస్వీఆర్ బయోపిక్ గురించి మాత్రం కృష్ణం రాజు మాత్రమే మొదట మాట్లాడారు. మరి ఈ విషయాన్ని ఆయన సీరియస్ గా తీసుకుని, ఆయనే నిర్మిస్తే బాగుంటుందని, ఆయనే ఎస్వీఆర్ పాత్రను కూడా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.