Begin typing your search above and press return to search.

ప్రభాస్ పిల్లాడు కాదన్న పెదనాన్న

By:  Tupaki Desk   |   27 Jun 2018 11:42 AM GMT
ప్రభాస్ పిల్లాడు కాదన్న పెదనాన్న
X
రెబెల్ స్టార్ పేరుని నిలబెడుతూ పెదనాన్న కృష్ణంరాజు వారసత్వాన్ని అంచనాలకు మించి మోస్తున్న ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పటికప్పుడు హాట్ కేక్ లాగా చర్చకు వస్తూనే ఉంది. త్వరలో విడుదల టైపు లో ప్రభాస్ దాని గురించి ప్రస్తావన వచ్చినప్పుడంతా దాటవేస్తున్నాడు కానీ ఎప్పుడు అని చెప్పకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. మామూలుగానే కాస్త సిగ్గరి అయిన ప్రభాస్ మీడియా ముందుకు రావడమే తక్కువ. అందుకే ఎక్కువ సార్లు పెళ్లి ప్రశ్న ఎదురుకోకుండా సేఫ్ అయ్యాడు.

కానీ పెదనాన్న కృష్ణంరాజు పరిస్థితి అది కాదు. పబ్లిక్ లైఫ్ లో ఉండటంతో పాటు తరచుగా వేడుకలకు వస్తుంటారు కాబట్టి ఆయన్ని పట్టుకుని అడిగేస్తూ ఉంటాయి మీడియా వర్గాలు. ఇటీవలే ఒక ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన సమాధానం చెబుతూ ప్రభాస్ పెళ్లి గురించి తాను అడుగుతూనే ఉన్నానని కానీ అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తే ఏం చేయాలనీ రివర్స్ లో అడిగేసారు. అయినా ప్రభాస్ చిన్న పిల్లడు కాదని ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో బాగా తెలుసని ఇక ఈ విషయం గురించి తనను అడగటం వల్ల పెద్దగా ఉపయోగం లేదని తేల్చేశారు.

కృష్ణంరాజు గారికి ప్రభాస్ పెళ్లి ప్లాన్ తో పాటు స్వీయ దర్శకత్వంలో ఒక్క అడుగు అనే సినిమా తీయాలని ఆయన కోరిక. కానీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అంతకు ముందు భక్త కన్నప్ప రీమేక్ కూడా అనుకున్నారు కానీ ప్రభాస్ ఇమేజ్ కి రిస్క్ చేసినట్టు అవుతుందేమోనని డ్రాప్ అయ్యారని సన్నిహితుల టాక్. ప్రభాస్ నిర్ణయానికి పెళ్లి విషయం వదిలేయడం బాగుంది కానీ వీలైనంత త్వరగా ఆ కార్యం ఏదో జరిగేలా చూడమని అభిమానులు పోరుతూనే ఉన్నారు. సాహో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా ముచ్చట్లు అందుతూనే ఉన్నాయి కానీ అసలైన పెళ్లి దావత్ ఎప్పుడు ఇస్తాడో ఏమో అని నిట్టూరుస్తున్నారు ఫ్యాన్స్.