Begin typing your search above and press return to search.
నైసుగా చీవాట్లు పెట్టిన రెబల్ స్టార్
By: Tupaki Desk | 2 Jan 2020 4:42 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) పరువు మర్యాదల్ని మంట కలుపుతున్న వారిపై సినీపెద్దలు గుర్రుగా ఉన్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. నేడు మా డైరీ ఆవిష్కరణలో వివాదాల ప్రహసనం కాస్తా మీడియా లైవ్ లకెక్కింది. ఇక ఈ వేదికపై నరేష్- రాజశేఖర్ మధ్య విభేధాలపై పెద్ద డిబేట్ రన్ అయ్యింది. రాజశేఖర్ ఎమోషనల్ ఎపిసోడ్స్ మీడియాలో హైలైట్ అయ్యాయి. కడుపు చించుకుంటే కాళ్లపై పడిన చందంగా అయ్యింది పరిస్థితి. సూటిగా మాట్లాడేయడం ద్వారా ఏదో సాధించాలని అనుకుంటే అక్కడ ఇంకేదో అయ్యింది.
అదంతా సరే కానీ.. ఈ వేదికపై చిరంజీవి- మోహన్ బాబు లాంటి పెద్దలు ఉన్నా రెబల్ స్టార్ కృష్ణం రాజు చెణుకుల్లాంటి సంభాషణలతో రక్తి కట్టించారు. టాలీవుడ్ పరువు మర్యాదల్ని గౌరవాన్ని గుర్తు చేసిన తీరు ఆకట్టుకుంది. సమస్యలుంటే పరిష్కరించుకోండి. మీరు చేసుకోలేనివాటికి మా దగ్గరకు రండి అంటూ జీవితా రాజశేఖర్ - నరేష్ బృందాలకు చురకలంటించారు.
అంతేకాదు.. ప్రపంచం మొత్తం మనవైపే చూస్తోంది. టాలీవుడ్ అంటే బాలీవుడ్ కే ఒణుకు. హాలీవుడ్ కూడా మనవైపు చూస్తోంది. బాహుబలి- సాహో- సైరా లాంటి చిత్రాలతో మనం ఆ స్థాయికి ఎదిగాం. మన గౌరవం మనం కాపాడుకోవాలి! అంటూ సూటిగా సుత్తి లేకుండా తిట్టారు.
అందరూ గౌరవాన్ని కాపాడాలి. నేను నా అనుకోకుండా.. మా `మా` సంఘం అని అనుకోవాలి. కలిసి పని చేయాలి. నిలబెట్టింది చాలు.. తెలుగు చిత్ర సీమకు ఉన్న గౌరవం చాలు.. ఇంతవరకు నిలబెట్టిన గౌరవం చాలు.. ఇంకా పెద్ద గౌరవం తీసుకురానక్కర్లేదు.. ఉన్న గౌరవాన్ని నిలబెడితే చాలు.. అంటూ కాస్తంత ఆవేదనగానే మాట్లాడారు రెబల్ స్టార్. సమస్యలేం ఉన్నా కో ఆర్డినేషన్ కమిటీ ఉంది. సామరస్యకంగా పరిష్కరించుకుంటూ.. గౌరవాన్ని పెంచుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా అని ఉద్భోద చేశారు.