Begin typing your search above and press return to search.
ప్రభాస్ పెళ్లి.. కృష్ణంరాజు ఫైర్
By: Tupaki Desk | 13 Nov 2015 4:25 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనని, ఒకవేళ ఉంటే బాహుబలి 2 తర్వాతే ఉంటుందని, ఇప్పటికే పెదనాన్న ఈ విషయంలో చాలా సీరియస్‌గా థింక్ చేస్తున్నారని, ప్రభాస్ పై చాలా కోపంగా ఉన్నారని, భీమవరం పిల్లని ఖాయం చేసేసే యోచనలో ఉన్నారని .. ఏవేవో రూమర్లు వినిపిస్తున్నాయి ఇటీవలి కాలంలో. అయితే ఈ సంగతి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు దృష్టికి వెళ్లింది.
అసలు ఇలాంటివన్నీ నమ్మకండి. మేం ప్రభాస్ పెళ్లి గురించి మరీ అంత హర్రీ అయ్యిందే లేదు. ఇలాంటి వార్తల్ని ఎలా ప్రచారం చేస్తారో. ఇటీవలి కాలంలో ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి. ఒకవేళ ప్రభాస్ పెళ్లి గురించిన శుభవార్త చెప్పాల్సి వస్తే అది ముందుగా మీడియాకే తెలియజేస్తాం. కాస్త ఓపిక పట్టండి.. అంటూ కృష్ణంరాజు అన్నారు. ''బేస్ లెస్ రూమర్స్. అస్సలు నమ్మకండి ఇలాంటివాటిని'' అంటూ కృష్ణంరాజు చెప్పారు. ప్రభాస్ పెళ్లి గురించి మీడియా కంటే దేశంలో ఉన్న అందమైన అమ్మాయిలకే ఎక్కువ కంగారుగా ఉంది. అసలే బాహుబలుడిగా అతడిని చూశాక.. అస్సలు ఆగలేని పరిస్థితి. అందుకోసమైనా రెబల్ స్టార్ కాస్త కంగారు పడతారేమో చూడాలి.