Begin typing your search above and press return to search.
కృష్ణ కూతుర్ని కృష్ణంరాజు దత్తత అడిగారా?
By: Tupaki Desk | 19 Feb 2016 4:23 AM GMTసూపర్ స్టార్ కృష్ణను ఇండస్ట్రీలో అజాత శత్రువు అంటారు. కల్మషం లేని ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడతారు. ఆయనతో పోటీ పడ్డ హీరోలు సైతం ఆయన్ని అభిమానించేవారు. అలాంటి వాళ్లలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఒకరు. గతంలో ఎన్నోసార్లు కృష్ణ అంటే తనకెంత అభిమానమో, గౌరవమో చెప్పిన కృష్ణం రాజు.. తాజాగా కృష్ణ హీరోగా నటించిన కొత్త సినిమా ‘శ్రీశ్రీ’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సూపర్ స్టార్ తో తన అనుబంధం గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. కృష్ణ చిన్న కూతుర్ని తాను దత్తత తీసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు.
‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బరువైన మనిషి - ఉత్తముడు - ఎగ్రెసివ్ పర్సన్ కృష్ణగారు. నన్నందరూ రెబల్ స్టార్ అంటారు. కానీ కృష్ణగారు రెబల్ ప్రొడ్యూసర్. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తీసి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించారు. మొదటి కలర్ సినిమా, కౌబోయ్ సినిమా.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన సాహసాలు ఎన్నెన్నో. కృష్ణ నిర్మాతలకే కాదు.. ఇండస్ట్రీకి కూడా ఎంతో మేలు చేశారు. ఏడాదికి 14, 15 సినిమాలు చేశారు. ఎందుకిలా చేస్తున్నారు అని ఎవరో అడిగితే.. ఏడాదిలో ఆరేడు సినిమాలు చేయొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తే ఇంకొన్ని కుటుంబాలు బతుకుతాయి అనేవారు. అది ఆయన గొప్పదనం.
నాకు, కృష్ణ గారికి మధ్య గొప్ప అనుబంధం ఉంది. ఎంతంటే.. కృష్ణ అఖరి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటానంటే ఇస్తానని అన్నాడు. మహేష్ బాబుతో ‘బాబి’ సినిమా తీయడానికి కూడా ముందుకొచ్చాను. మేమంతా ఒకే కుటుంబం. ఎప్పుడైనా కృష్ణ వస్తున్నాడంటే కలవడానికి నేను ఆత్రుతగా ఎదురుచూస్తాను. ఈ ఫంక్షన్ కు రావడానికి కూడా అదే కారణం. కృష్ణ 50 సంవత్సరాల పాటు ఎక్కడా అలసిపోకుండా విజయనిర్మల కాపాడుకుంది. కృష్ణ 50 ఏళ్ల ప్రస్థానం పూర్తయ్యాక కూడా ‘శ్రీశ్రీ’ సినిమాలో ఉత్సాహంగా నటించారు. ఆయన ఇదే హుషారుతో మరిన్ని సినిమాలు చేయాలి. ’’ అన్నారు కృష్ణంరాజు.