Begin typing your search above and press return to search.
ఈయన కూడా చిన్న సినిమాల గురించేనా..
By: Tupaki Desk | 20 Jan 2016 9:30 AM GMTఇప్పటిరకు దాసరి నారాయణ రావు ఒక్కరే చిన్న సినిమాల గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా మరో సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా దీని గురించే గొంతు చించుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు ధియేటర్లు దొరకట్లేదని.. టాలీవుడ్ ను ఈ సమస్య నుండి రివైవ్ చేయాల్సి ఉందనీ చెప్పుకొచ్చారు.
మ్యాటర్ ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో స్ర్కీన్లు పెంచితే కాని.. చిన్న సినిమాలకు ధియేటర్లు దొరకవ్ అంటున్నారు సీనియర్ రెబెల్ స్టార్. ఈ విషయంపై సినిమా ఇండస్ట్లీలోని పెద్దలతో.. బిజెపి పార్టీ పెద్దలతో.. ఆల్రెడీ మాట్లాడారట. సెంట్రల్ గవర్నమెంటుతో మాట్లాడి.. ఒక పరిష్కారం చేస్తాను అంటున్నారు. బాగానే ఉంది. అయితే అసలు సింగిల్ స్ర్కీన్ ధియేటర్లను చాలావరకు మూసేసి కళ్యాణ్ మండపాల్లా మార్చేస్తున్నారనే విషయం ఈయనకు తెలుసంటారా?
సినిమాలకు జనం రాక.. పైరసీ వలన సగంమంది ఆడియన్స్ హ్యాండ్ ఇచ్చేయడంతో.. వచ్చే సినిమాల్లో క్వాలిటీ లేకపోవడంతో.. ధియేటర్లు మూసేస్తుంటే.. ఇప్పుడు కృష్ణంరాజు స్క్రీన్లు పెంచాలని అనడం ఏంటో?? నాలుగు ధియేటర్లు పెరిగినా.. నాలుగు స్ర్కీన్లు పెరిగినా.. అవి కూడా పెద్ద సినిమాలే తన్నుకుపోతాయ్ కాని.. చిన్న సినిమాలకు ఒరిగేదేం ఉండదేమో.