Begin typing your search above and press return to search.

ట్రేడ్ టాక్: నాని తేవాల్సింది చాలా ఉంది

By:  Tupaki Desk   |   11 April 2018 10:42 AM GMT
ట్రేడ్ టాక్: నాని తేవాల్సింది చాలా ఉంది
X
న్యాచురల్ స్టార్ నాని కృష్ణార్జున యుద్ధం మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న నేపధ్యంలో దీని మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. ట్రైలర్ మరీ వినూత్నంగా అనిపించకపోయినా ఈ మధ్య యావరేజ్ కంటెంట్ తో సైతం హిట్ రేంజ్ వసూళ్లు రాబడుతున్న నాని మీద పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఆ క్రమంలోనే కృష్ణార్జున యుద్ధం కూడా దాదాపు 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుందని ట్రేడ్ టాక్. ఇది ఇప్పుడున్న పోటీలో పెద్ద మొత్తమే. ఒకపక్క రంగస్థలం మేనియా కొనసాగుతోంది. చల్ మోహనరంగా ఓ మాదిరిగా ఆడేస్తోంది. ఎల్లుండి ప్రభుదేవా మెర్క్యూరీతో పాటు క్రేజీ హాలీవుడ్ మూవీ ర్యాంపేజ్ డబ్బింగ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. మరో వారం రోజులు ఆగితే మహేష్ భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ అంతా నాదే అంటూ దాడి చేస్తాడు. ఈ నేపధ్యంలో నానికి ఈసారి ప్రయాణం అంత ఈజీగా ఉండబోవడం లేదు.

ఇక ఏరియాల వారిగా లెక్కలు చూసుకుంటే నైజాంకు 8.5 కోట్ల దాకా అమ్ముడుపోతే సీడెడ్ కు 3.6 కోట్ల రేట్ పలకడం విశేషం. ఇక ఆంధ్ర మొత్తం కలిపి 9 కోట్ల బిజినెస్ చేసుకున్న కృష్ణార్జునులు మిగిలిన రాష్ట్రాల్లో 2.7 కోట్ల దాకా రాబట్టారు. ఇక ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ప్లస్ ఇమేజ్ ఉన్న నానిని చూసే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల 80 లక్షల దాకా ఇన్వెస్ట్ చేసారు. ఏతావాతా ఖర్చులు మొత్తం కలుపుకుని 30 కోట్ల దాకా లెక్క తేలింది. ఇప్పుడు దీన్ని షేర్ రూపంలోనే నాని తేవాల్సి ఉంటుంది. అంటే గ్రాస్ ఎంత లేదన్నా 50 కోట్లు టచ్ అయితే తప్ప ఇది లాభాల కిందకు రాదు. సినిమా మీద యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం సహజం కనక దాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేం కాని బజ్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా బాగుంది అనే మౌత్ పబ్లిసిటీ వస్తే కృష్ణార్జునులు ఆ మొత్తాన్ని వెనక్కు తేవడంలో సందేహం అక్కర్లేదు. అది రేపు వచ్చే టాక్ ప్లస్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఉంది.మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్-రుక్సన్ మీర్ హీరొయిన్లు.