Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: మాస్ కృష్ణ పోష్ అర్జున్ యుద్దం

By:  Tupaki Desk   |   10 March 2018 11:09 AM IST
టీజర్ టాక్: మాస్ కృష్ణ పోష్ అర్జున్ యుద్దం
X
ఇద్దరు నానీలు.. ఒకరితో ఒకరు యుద్దం చేస్తారో లేదో తెలియదు కాని.. ఎవరికివారు వారి జీవితాలతో వారే యుద్దానికి దిగుతున్నారని అర్ధమవుతోంది. గతంలో వెంకటాద్రి ఎక్సప్రెస్ మరియు ఎక్సప్రెస్ రాజా వంటి సినిమాలను తీసిన దర్శకుడు మేర్లపాక గాంధి.. ఇప్పుడు హీరో నానితో ఒక డ్యుయల్ యాక్షన్ రోల్ చేయిస్తూ.. ''కృష్ణార్జున యుద్దం'' అంటూ వస్తున్నాడు. పదండి ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం.

సాధారణంగా నాని సినిమాలంటే ఎంటర్టయిన్మెంట్ కు కొదవ ఉండదు. ఇప్పుడు ఈ ''కృష్ణార్జున యుద్దం''లో కూడా అంతే. ఇక రాయలసీమలో తిరిగే మాస్ కుర్రాడిగా కృష్ణ కనిపిస్తాడు. అతను ఒక అమ్మాయిని (రుక్సార్ మీర్) ప్రేమలోకి పడేయాలని అనుకుంటాడు. ఇక కనిపించిన ప్రతీ అమ్మాయినీ ముగ్గులోకి దింపేసే ప్లేబాయ్ తరహాలో మెంటాల్టీ ఉన్న పోష్ రాక్ స్టార్ అర్జున్.. చివరకు ఒక అమ్మాయిని (అనుపమ పరమేశ్వరన్)ను మాత్రం ప్రేమలో పడేయలేకపోతాడు. వీరిరువురూ వీరి లవ్ లైఫ్‌ లో ఎలా సక్సెస్ సాధించారు అనేదే అసలు కథ.

ఈ సినిమాలో మరోసారి దర్శకుడు తన మార్కు కామెడీని పండించాడు అనడానికి.. ''రామాయణంలో ధర్మరాజు ఎందుకు ఉంటాడురా'' అనగానే హీరో కొట్టడం.. అతను కొట్టగానే దెబ్బతిన్న ఆ క్యారక్టర్ ''ఉంటారు ఉంటారు.. రామాయణంలో ధర్మరాజే కాదు.. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎడిటిర్ గౌతం రాజు కూడా ఉంటారు'' అనేస్తాడు. ఇలాంటి ఊర మాస్ పంచులు ప్లస్ నాని ప్లస్ ఇద్దరు బ్యుటిఫుల్ హీరోయిన్స్.. చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది.