Begin typing your search above and press return to search.
కృష్ణాష్టమికి యు/ఎ చేతిలో పెట్టారు
By: Tupaki Desk | 16 Feb 2016 4:45 PM GMTహీరో సునీల్ నటించిన కృష్ణాష్టమి ఈ నెల 19న విడుదలకు అన్నీ సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యకలాపాలు మొదలు పెట్టేయగా.. ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది కృష్ణాష్టమి. ఈ మూవీకి సెన్సార్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూవీపై ఇన్ సైడ్ టాక్ అయితే చాలా పాజిటివ్ గా ఉంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కిన కృష్ణాష్టమిలో.. సునీల్ మార్క్ కామెడీకి ఏ మాత్రం లోటు లేదంటున్నారు.
డ్యాన్సుల్లోనూ సునీల్ ఇరగదీశాడని తెలుస్తోంది. అలాగే హీరోయిన్స్ నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడేలు.. స్కిన్ షోతో బాగా ఆకట్టుకుంటారట. అసలు కృష్ణాష్టమికి యూ/ఏ రావడానికి కారణం ఈ ముద్దుగుమ్మల అందాల ప్రదర్శనే అన్నది అసలు విషయం. ఈ మూవీ మాస్ లోకి వెళ్లేందుకు ఉన్న ప్లస్ పాయింట్లలో ఈ భామల అందాలు కీలకం కానున్నాయి. ఇక దినేష్ కనగరత్నం అందించిన సంగీతం కూడా ఆకట్టుకోనుందని చెబ్తున్నారు.
ముఖ్యంగా చాలా ఫాస్ట్ గా నడిచే కథనం 2గంటల 14నిమిషాల రన్ టైం.. మేజర్ ప్లస్ పాయింట్స్ కానున్నాయట. వాసు వర్మ డైరెక్షన్, దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన కృష్ణాష్టమి.. ఈ వారం రిలీజ్ లలో మేజర్ మూవీ. ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్, టాక్ తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కొన్నాళ్లుగా బ్యాడ్ టైం ఎదుర్కుంటున్న రైటర్ కోన వెంకట్ అందించిన కథ కావడంతో.. కోన కూడా ఈ మూవీ రిజల్ట్ పై కోటి ఆశలు పెట్టుకున్నాడు.