Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ కు కృష్ణవంశీ కొత్త బిరుదు
By: Tupaki Desk | 7 Jan 2022 10:35 AM GMTప్రకాష్ రాజ్ నటన గురించి, అతని నటనాకౌశలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమర్షియల్ చిత్రాల్లో ఏ స్థాయి నటనని ప్రదర్శించగలడో అదే స్థాయి నటనని ఆర్ట్ సినిమాల్లోనూ ప్రదర్శించగల దిట్ట. అలాంటి నటుడిపై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ ని రాక్షసుడితో పోల్చి షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే... చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ `రంగా మార్తాండ` చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.
విలక్షణ నటుడు నానా పటేకర్ నటించిన మరాఠీ చిత్రం `నట సమ్రాట్` చిత్రం ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. వెర్సటైల్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. మిగతా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక రాజశేఖర్, అనసూయ, అలీరెజా, రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్నారు. గత కొంత కాలంగా కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా లాస్ట్ షెడ్యూల్ మొదలైంది.
గురువారం సెట్‌లో ప్రకాష్ రాజ్ మానిటర్ ముందు కూర్చున్న ఫొటో ని షేర్ చేసిన కృష్ణవంశీ శుక్రవారం ఉత్తేజ్ ఫొటోని షేర్ చేసి ప్రకాష్ రాజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడం పలువురిని షాక్ కు గురిచేసింది. `రంగ మార్తాండ` చివరి అంకం మొదలైంది. నేను అత్యంత అభిమానించే నటుడు.. నటరాక్షసుడు ప్రకాష్ రాజ్ తో భావోద్వేగభరితమైన క్లైమాక్స్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నా..స్టన్నింగ్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుంత కృష్ణవంశీ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రకాష్ రాజ్ - కృష్ణశంశీ కలయికలో ఎన్నో అద్భుతమైన పాత్రలొచ్చాయి. అందులో `అంతఃపురం`లో ప్రకాష్ రాజ్ నరసింహగా కరుడుగట్టిన ఫ్యాక్షనిస్టుగా కనిపించాడు. ఈ పాత్రకు ప్రకాష్ రాజ్ కు ప్రత్యేక విభాగంలో జాతీయ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ఆ తరువాత `సముద్రం`లో కానిస్టేబుల్ నూకరాజు, `ఖడ్గం`లో అమ్జాద్, `గోవిందుడు అందరి వాడేలే` చిత్రంలో బాలరాజు పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. `రంగమార్తండ` ప్రకాష్ రాజ్ కు అవార్డుల్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.