Begin typing your search above and press return to search.
కృష్ణవంశీ పట్టుదల గెలిపించిన 'ఖడ్గం'..!
By: Tupaki Desk | 30 Nov 2022 3:34 AM GMTతెలుగు సినీ పరిశ్రమలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు కృష్ణవంశీ. రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసి గులాబితో తొలి ప్రయత్నమే సూపర్ హిట్ అందుకున్న కృష్ణవంశీ టాలీవుడ్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. అయితే ఆయన ఎన్ని సినిమాలు తీసినా కృష్ణవంశీ అనగానే గుర్తొచ్చే కొన్ని సినిమాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందులో ఖడ్గం ఒకటి. 2002 నవంబర్ 29న రిలీజైన ఆ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన కృష్ణవంశీ అప్పటికే సింధూరం అనే మూవీ తీసిన ఆయన ఖడ్గం కథ రాసుకున్నారు. సినిమాలో కృష్ణవంశీ టచ్ చేసిన సబ్జెక్ట్ చాలా సున్నితమైనది. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయన చేసిన ప్రయత్నం మెచ్చుకోబడ్డది. అంతకుముందు మురారి లాంటి క్లాస్ సినిమా తీసిన కృష్ణవంశీ మధ్యలో హిందీలో శక్తి అనే ఒక మూవీ తీశారు. ఆ తర్వాత వెంటనే ఖడ్గం తెరకెక్కించారు.
ఈ మూవీలో శ్రీకాంత్ చేసిన పోలీస్ పాత్రలో మరొకరిని పెట్టాలని నిర్మాత మధు మురళి చెప్పారట. క్లాస్ ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ ఇలాంటి పాత్ర చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో అన్న ఆలోచన ఆయనకు ఉంది. అయితే ఆ విషయాన్ని శ్రీకాంత్ ముందే తేలగొట్టి అతన్ని పట్టుబట్టి ఆ పాత్ర చేయించేలా చేశారు కృష్ణవంశీ. హీరోగా మారిన తర్వాత అప్పటివరకు క్లాస్ పాత్రలు చేస్తూ వచ్చిన శ్రీకాంత్ కెరీర్ లో ఫస్ట్ టైం సీరియస్ రోల్ లో మెప్పించారు.
ఖడ్గం సినిమాలో అంజాద్ గా ప్రకాశ్ రాజ్, కోటి పాత్రలో రవితేజ, రాధాకృష్ణ పాత్రలో శ్రీకాంత్ ఖడ్గం సినిమాకు మూడు పిల్లర్స్ గా మారారు. ఈ సినిమా కోసం ఉగ్రవాదుల ప్రవర్తన తెలుసుకునేందుకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ని రిక్వెస్ట్ చేసి జైలుకు వెళ్లి వారి గురించి అధ్యయనం చేశారట కృష్ణవంశీ. అంత డెడికేటెడ్ గా వర్క్ చేశారు కాబట్టే.. సినిమా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంది.
ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టేసింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఒక సెన్సేషన్ గా మారాయి. ముసుగు వేయొద్దు మనసు మీద.. నువ్వు నువ్వు లాంటి మెలోడీ సాంగ్.. మేమే ఇండియన్స్.. ఖడ్గం టైటిల్ సాంగ్ ఇలా వేటికవే ప్రత్యేకం అనిపించేలా సంగీతం అందించారు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం.. గణతంత్ర దినోత్సవం నాడు ఖడ్గం సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి.
ఈ సినిమాతోనే 30 ఇయర్స్ పృథ్వీ పాపులర్ అయ్యాడు. సినిమాలో ఆయన చేసింది చిన్న పాత్రే అయినా ఆ ఒక్క డైలాగ్ తో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక రవితేజ రియల్ లైఫ్ సినీ కష్టాలు కూడా ఈ సినిమాలో చూపించారు కృష్ణవంశీ. ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ ఎలా తన అవకాశాల కోసం తిరిగేవాడో అది కళ్లకి కట్టినట్టు చూపించారు. ఖడ్గం సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాకుండా సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాకు బెస్ట్ డైరక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు కృష్ణవంశీ. అంతేకాదు ఉత్తమ జాతీయ సమగ్రతా సినిమాతో పాటుగా బెస్ట్ ఆర్ట్ డైరక్టర్, బెస్ట్ మేకప్ అవార్డులు అందుకున్నారు. రవితేజకు ఈ సినిమాతో స్పెషల్ జ్యూరీ నంది వచ్చింది. ఖడ్గం మూవీ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా 3 కేటగిరిల్లో అవార్డులను కైవసం చేసుకుంది.
20 ఏళ్లు కాదు మరో 20 ఏళ్లైనా సరే ఖడ్గం సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఖడ్గం సినిమా రిలీజైన టైం లో కృష్ణవంశీకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి.. అందుకే ఆయన కొద్దిరోజులు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.