Begin typing your search above and press return to search.
ఔను మేమిద్దరం ఎంగేజ్.. సహనటితో స్టార్ హీరోయిన్ పెళ్లి
By: Tupaki Desk | 4 Nov 2021 6:41 AM GMTఈమద్య కాలంలే గే మ్యారేజ్ లు చాలా కామన్ అయ్యాయి. ఇటీవలే తెలంగాణలో కూడా మొదటి గే మ్యారేజ్ జరిగింది. అలాంటిది అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో ఏ రేంజ్ లో గే మ్యారేజ్ లు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. భారీ ఎత్తున గే మ్యారేజ్ లు జరుగుతున్నా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు గే మ్యారేజ్ చేసుకుంటే మాత్రం చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. తాజాగా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టెవర్ట్ తాను సహ నటి డైలాన్ మేయర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. తమ ఇద్దరికి కూడా వివాహ నిశ్చితార్థం అయ్యిందని క్రిస్టెన్ అధికారికంగా ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా క్రిస్టెన్ మరియు డైలాన్ లు రిలేషన్ లో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారని కొందరు.. సహ జీవనం సాగిస్తున్నారు అంటూ కొందరు ప్రచారం చేశారు. అయితే ఇన్ని రోజులు ఆ వార్తలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ కొందరు భావించారు. కాని తాజాగా క్రిస్టెన్ అధికారికంగా తాము ఎంగేజ్ అయినట్లుగా ప్రకటించడంతో ఇన్నాళ్లు వస్తున్న వార్తలు నిజమే అని తేలిపోయింది. ఒక షో కు గెస్ట్ గా హాజరు అయిన క్రిస్టెన్ తమ రహస్య ఎంగేజ్ మెంట్ గురించి అధికారికంగా క్లారిటీ ఇవ్వడంతో ఇన్నాళ్ల సస్పెన్స్ కు తెర దించినట్లయ్యింది.
ఈ సందర్బంగా క్రిస్టెన్ మాట్లాడుతూ.. జీవితంలో ఎవరితో కలిసి ఉంటే సంతోషంగా ఉంటామో వారితో కలిసి ఉండాలి. మేము ఒకరి కోసం ఒకరం అన్నట్లుగా బతకాలని నిర్ణయించుకున్నాం. నా కోసం తను.. తన కోసం నేను చాలా మార్చుకున్నాం. మమ్మల్ని మేము మార్చుకోవడంతో పాటు మేము ఇద్దరం కలిసి పోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే వివాహంకు సిద్దం అయ్యాము. త్వరలోనే మా పెళ్లి ఉంటుందని క్రిస్టెన్ పేర్కొంది. అయితే ఈ విషయమై డైలాన్ స్పందన కోసం అంతర్జాతీయ మీడియా ఎదురు చూస్తోంది. మూడు సంవత్సరాల రిలేషన్ షిప్ కు పెళ్లి తో ఒక అర్థం తీసుకు వచ్చేలా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొందరు వీరిని అభిమానించే వారు వీరి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా కాస్త వ్యతిరేకత వస్తోందట. వాటన్నింటిని పక్కకు పెట్టి ఎలా జీవితంను సాగించాలో అలాగే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా క్రిస్టెన్ మరియు డైలాన్ లు నిర్ణయించుకున్నారట.