Begin typing your search above and press return to search.
క్యూటీకి తప్పులు దిద్దుకునే ఛాన్సుంది
By: Tupaki Desk | 23 Jan 2022 5:00 AM GMTతనదైన అందం ప్రతిభతో యువతరం హృదయాల్లో చోటు సంపాదించుకుంది కృతి శెట్టి. మలయాళం నుంచి అనుపమ పరమేశ్వరన్ లాంటి వేవ్ వచ్చాక అంతే గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించుకున్న బ్యూటీగా కృతి పేరు మార్మోగుతోంది. ఒకరకంగా ఆరంగేట్రమే 100కోట్ల క్లబ్ లో చేరిన `ఉప్పెన`తో పరిచయమైంది కాబట్టి తనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
ఇటీవలే విడుదలైన బంగార్రాజులో అంతగా ప్రాధాన్యత లేని పాత్రకు పరిమితమైన ఈ బ్యూటీ.. సుధీర్ బాబు సరసన కొత్త చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`లో నటించింది. ఇంతకుముందే టీజర్ విడుదలైంది. ఇందలో కృతి శెట్టి పాత్ర శ్యామ్ సింఘరాయ్ మొదటి భాగంలో ఆమె పోషించిన పాత్ర మాదిరిగానే ఉంది. బంగార్రాజులో కూడా కృతి పల్లెటూరి అమ్మాయిగా కనిపించినా ఆ రోల్ అంతంత మాత్రమే.
మల్టీస్టారర్ లో ఇతర నాయికల డామినేషన్ వల్ల కృతి ఎలివేట్ కాలేదు. ఇకపోతే రొటీన్ పాత్రల్లో కనిపించినా అందంతో కవ్వించడం తనకు ప్లస్. అయినా మునుముందు రొటీనిటీతో ప్రాబ్లెమేనని విశ్లేషిస్తున్నారు.
ఓవైపు పారితోషికం పెద్దగా డిమాండ్ చేస్తోందన్న విమర్శల నడుమ కృతి శెట్టి ఎంపికల విషయంలోనూ తడబాటుకు గురవుతోంది? అంటూ విశ్లేషిస్తున్నారు. అయితే ఈ క్యూటీ ఇంకా నాలుగైదు సినిమాల కిడ్ అన్న సంగతిని గుర్తుంచుకోవాలి. తనకి నిరూపించుకునేందుకు చాలా ఛాన్స్ ఉంది. కానీ రొటీన్ పాత్రలతో కాలయాపన చేస్తే కష్టం అవుతుంది. తప్పులు దిద్దుకుని ముందుకెళుతుందా లేదా? అన్నది చూడాలి. కృతి తదుపరి రామ్ సరసన లింగుస్వామి తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.