Begin typing your search above and press return to search.

రామ్ ను ఉస్తాద్ అని ఎందుకంటారో అర్థమైంది: కృతి శెట్టి

By:  Tupaki Desk   |   11 July 2022 4:33 AM GMT
రామ్ ను ఉస్తాద్ అని ఎందుకంటారో అర్థమైంది: కృతి శెట్టి
X
టాలీవుడ్ లో అందాల జాబిలమ్మగా కృతి శెట్టికి ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇంతవరకూ ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ వచ్చింది.

అలా హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి నుంచి నాలుగో సినిమాగా 'ది వారియర్' వస్తోంది. ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాతోనే ఆమె కోలీవుడ్ కి పరిచయమవుతోంది. ఈ నెల 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ స్టేజ్ పై కృతి శెట్టి మాట్లాడింది.

" రామ్ ఎనర్జీని గురించి నేను విన్నాను .. ఈ సినిమాతో చూశాను. డాన్స్ విషయానికి వస్తే ఆయన ఎనర్జీ లెవెల్స్ ను అందుకోవడం చాలా కష్టం. ఆయన డెడికేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయనను అంతా ఉస్తాద్ అని ఎందుకు పిలుస్తారనేది నాకు అర్థమైంది.

ఆయన హార్డ్ వర్క్ ను అభినందించకుండా ఉండలేం. లింగుసామి గారు డైమండ్ అనే విషయం నాకు తెలుసు. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆయన మనసు ఎంత మంచిదనేది అర్థమవుతుంది.

'ఉప్పెన' సినిమాకి దేవిశ్రీ సార్ ఎంత హిట్ సాంగ్స్ ఇచ్చారనేది మీకు తెలుసు. ఆయనతో కలిసి ఎప్పుడు పనిచేస్తానా అనుకున్నాను. ఆ వెంటనే ఈ సినిమా వచ్చింది.

సుజీత్ గారు ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు .. అందుకు ఆయనకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. నిర్మాత శ్రీనివాస్ గారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఆయనని చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ సినిమాను థియేటర్ కి వెళ్లి చూడండి .. తప్ప కుండా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చింది.