Begin typing your search above and press return to search.

ప్లాన్ మార్చిన బేబమ్మ..!

By:  Tupaki Desk   |   11 Nov 2022 5:34 AM GMT
ప్లాన్ మార్చిన బేబమ్మ..!
X
బాలీవుడ్ తర్వాత అంత పెద్ద స్థాయిలో సినిమాలు తీస్తే పరిశ్రమ అంటే అనరు టాలీవుడ్ గురించే చెబుతారు. ఈమధ్య మన సినిమాలు బాలీవుడ్ లో కూడా టాప్ లేపేలా రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకే ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని హీరోయిన్స్ కూడా అనుకుంటారు.

టాలీవుడ్ లో హీరోయిన్ గా క్లిక్ అయితే చాలు ఒక్క సినిమా హిట్ అయితే పది సినిమాల ఆఫర్లు ఒకేసారి వచ్చేస్తాయి. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బెంగుళూరు భామ కృతి శెట్టి.

ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి చూపించిన అభినయం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిని. మొదటి సినిమాకే స్టార్ క్రేజ్ తెచ్చుకున్న జాబితాలో కృతి శెట్టిని చేర్చింది. ఉప్పెన హిట్ తో అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన తర్వాత నానితో శ్యామ్ సింగ రాయ్ సినిమా చేసిన కృతి శెట్టి ఆ మూవీతో కూడా హిట్ అందుకోగా నెక్స్ట్ వచ్చిన బంగార్రాజు కూడా సక్సెస్ అయ్యింది.

హ్యాట్రిక్ హిట్స్ తో కృతి శెట్టి రేంజ్ పెరగ్గా తర్వాత వచ్చిన 3 సినిమాలు ఫ్లాప్ అయ్యి అమ్మడికి షాక్ ఇచ్చాయి. బంగార్రాజు తర్వాత రామ్ తో ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేసింది. ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి.

హ్యాట్రిక్ హిట్, హ్యాట్రిక్ ఫ్లాప్ లతో కెరియర్ రిస్క్ లో పడ్డ బేబమ్మ వచ్చిన ప్రతి ఛాన్స్ చేయకూడదు అని ఇప్పుడు జ్ఞానోదయమైంది. ఉప్పెన క్రేజ్ తో వచ్చినా సినిమా ప్రతి ఒక్కటి సైన్ చేసుకుంటూ వెళ్తే ఇలానే జరుగుతుంది. అందుకే కృతి శెట్టి సినిమాలకు కొద్దిగా టైం తీసుకోవాలని అనుకుంటుంది. ప్రస్తుతం కృతి శెట్టి నాగ చైతన్యతో వెంకట్ ప్రభు మూవీలో జోడీ కడుతుంది. ఈ మూవీతో పాటుగా మళయాళంలో కూడా కొత్త మూవీ చేస్తుంది.

ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎన్ని సినిమాలతో ప్రేక్షకులు మనసులు గెలిచామన్నది ఇంపార్టెంట్ అందుకే ఇక మీదట కథల విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఉండాలని అనుకుంటుంది కృతి శెట్టి. చైతు సినిమా కూడా రిజల్ట్ తేడా కొడితే మాత్రం కృతి గ్రాఫ్ తగ్గినట్టే. అందుకే రెమ్యునరేషన్, కాస్టింగ్ కన్నా కథకే మోట ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కృతి శెట్టి మార్చిన ఈ ప్లాన్ అమ్మడికి ఎంతవరకు ఆమె కెరియర్ కు హెల్ప్ చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.