Begin typing your search above and press return to search.
బేబమ్మ దేశానికే సర్పంచ్ ... అదెట్టా?
By: Tupaki Desk | 11 Jan 2022 4:30 AM GMTగత ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం `ఉప్పెన`. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రమిది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై అందించిన ఈ మూవీ ద్వారా ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన ఈ మూవీతో ముంబై బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తొలి చిత్రంతో బేబమ్మగా ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపుని దక్కించుకుంది. బేబమ్మగా ఊమించని స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన `శ్యామ్ సింగ రాయ్`లో మోడ్రన్ యువతిగా కనిపించిన సర్ ప్రైజ్ చేసింది. ఈ మూవీ కోసం నానితో లిప్ లాక్ చేసి షాకిచ్చిన కృతిశెట్టి ఈ సంక్రాంతికి `బంగార్రాజు`తో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
`బంగార్రాజు` జనవరి 14న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార పర్వాన్నిహోరెత్తిస్తున్నారు. ఈ ఆదివారం `బంగార్రాజు` మ్యూజికల్ నైట్ ని నిర్వహించిన మేకర్స్ చిత్ర బృందంతో తాజాగా సంక్రాంతి స్పెషల్ ఇంటర్త్యూని ప్లాన్ చేశారు. ఇందులో కింగ్ నాగార్జున, నాగచైతన్య, దర్శకుడు కల్యాణ్ కృష్ణతో పాటు క్రేజీ హీరోయిన్ బేబమ్మ కృతిశెట్టి కూడా పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది.
`ఉప్పన`లో బేబమ్మగా, శ్యామ్ సింగ రాయ్` లో కీర్తిగా విభిన్నమైన పాత్రల్లో నటించిన కృతిశెట్టి `బంగార్రాజు`లో మాత్రం మరో కొత్త పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో బేబమ్మ నాగలక్ష్మిగా కనిపిస్తుందట. ఇందులో గ్రామ సర్పంచ్‌గా కనిపించే కృతిశెట్టికి దేశానికే సర్పంచ్ కావాలని కోరిక వుంటుందట. అంతే కాకుండా ఆమె పాత్ర ఫుల్ పటాకాలా వుంటుందని. పక్క వారిపై పంచ్ లు వేస్తూ వుంటుందట. దర్శకుడు తన పాత్రని మంచి టైమింగ్ తో తీర్చి దిద్దారట.
నాగలక్ష్మి పాత్రలో తనదైన పంచ్ లతో ఆకట్టుకోవడానికి కృతిశెట్టి చాలానే శ్రమించిందంట. ఇందులో డిఫరెంట్ స్లాంగ్ తో నాగలక్ష్మీ పాత్ర సాగుతుందట. ఆ స్లాంగ్ ని పట్టుకోవడానికి దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన పాత్రకు బాగా హెల్ప్ చేశాడని, అందువల్లే తాను నాగలక్ష్మీ పాత్రని పోషించగలిగానని చెప్పుకొచ్చింది బేబమ్మ. ఈ సినిమాలో పటాకాగా తనదైన పంచ్‌లతో హంగామా చేయబోతోందట. ఈ మూవీ కూడా తనకు మంచి గుర్తింపుని తెచ్చిపెడుతుందని చెప్పుకొచ్చింది కృతిశెట్టి.