Begin typing your search above and press return to search.

సినిమాతో ప్రేమ.. షూటింగ్స్ తో డేటింగ్.. బేబమ్మ సూపరమ్మా..?

By:  Tupaki Desk   |   14 May 2023 7:00 AM
సినిమాతో ప్రేమ.. షూటింగ్స్ తో డేటింగ్.. బేబమ్మ సూపరమ్మా..?
X
ఉప్పెన బేబమ్మ ఈ మధ్య కాస్త డల్ అయినట్టు కనిపిస్తుంది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎద్గిన అమ్మడు వరుస ఛాన్స్ లు అందుకున్నా కథల ఎంపిక లోపం వల్ల సినిమాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి. నిజాన్ని త్వరగానే గుర్తించిన అమ్మడు ఇప్పుడు స్టోరీ సెలక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. రీసెంట్ గా నాగ చైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి ఆ సినిమాతో హిట్ కొడుతుందని అనుకుంటే అది కాస్త యావరేజ్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో లవ్ డేటింగ్ లాంటి విషయాల మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది అమ్మడు. ప్రేమ స్వచ్చమైనది కానీ తను ఇప్పటివరకు అమ్మా నాన్న ప్రేమని తప్ప మరే ప్రేమ చూడలేదని అంటుంది.

తనకు కాలేజ్ డేస్ లో బోలెడన్ని లవ్ లెటర్స్ వచ్చాయని కాని తనకు మాత్రం ఎలాంటి ఫీలింగ్ కలగలేదని అంటుంది. ప్రస్తుతం కృతి శెట్టి ఎవరినైనా ప్రేమిస్తుందా అన్న ప్రశ్న అడిగితే నేను అమ్మానాన్నలను ప్రేమిస్తున్నా అంటూ తెలివైన ఆన్సర్ ఇస్తుంది.

అంతేకాదు సినిమాలతో ప్రేమ.. షూటింగ్స్ తో డేటింగ్ అంటూ కామెడీ చేస్తుంది. ప్రస్తుతానికి సినిమాలే తనకు ఇంపార్టెంట్ అని మిగతా విషయాన్ని తర్వాత అంటుంది. బేబమ్మ గా తెలుగు ప్రేక్షకులను అలరించిన కృతి శెట్టి వరుస సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హిట్లు మాత్రం కొట్టట్లేదు. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రతి ఛాన్స్ చేయకుండా కేవలం సెలెక్టెడ్ సినిమాలనే చేస్తూ వస్తుంది.

నాగ చైతన్య కస్టడీ కూడా వచ్చేసింది. ఇక నెక్స్ట్ అమ్మడు శర్వానంద్ సినిమాపై హోప్స్ పెట్టుకుంది. శర్వానంద్ తో కృతి శెట్టి మొదటిసారి జత కడుతుంది. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. కృతి శెట్టి కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరగాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.