Begin typing your search above and press return to search.

ఉప్పెన పాపను అప్పుడే ద్వేషిస్తారే..

By:  Tupaki Desk   |   19 Sep 2022 2:40 PM GMT
ఉప్పెన పాపను అప్పుడే ద్వేషిస్తారే..
X
పదహారేళ్ళ వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో టైటిల్ కు తగ్గట్టుగానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ అలా వచ్చిందో లేదో ఆఫర్లు అయితే జోరుగా వచ్చాయి. కానీ కృతి తొందరపడకుండా కేవలం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మొదటి సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక ఆ తరహాలో ఆలోచించే ఆమె ఉప్పెన తర్వాత చేసిన బంగార్రాజు కమర్షియల్ గా సక్సెస్ అయింది.

ఇక నానితో చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ బ్యూటీ తొందరగానే కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలకు కొత్త హీరోయిన్ దొరికేసింది అని కూడా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ బ్యూటీ ఆ సినిమాల తర్వాత సెలెక్ట్ చేసుకున్న కమర్షియల్ సినిమాలు పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా ఇప్పుడు డిజాస్టర్లు చూస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది.

మొన్నటి వరకు ఉప్పెన సినిమాకు సంబంధించిన సీన్స్ తో పోస్టర్లతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్రేజ్ అందుకున్న బేబమ్మ ఇప్పుడు మళ్లీ ఒక్కసారిగా వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో ట్రోలింగ్ బారిన పడుతోంది. రామ్ పోతినేని దివారియర్ సినిమాతో పాటు ఆ తర్వాత నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.

ఇక రీసెంట్ గా వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కూడా మొదటి రోజే నెగటివ్ టాక్ అందుకోవడంతో థియేటర్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో అప్పుడే ఐరన్ లెగ్ గ్ అయిపోయింది అంటూ వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. సాధారణంగా స్టార్స్ హిట్స్ లో ఉన్నప్పుడు పొగుడుతూ ఆ తర్వాత ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు వారిని ట్రోల్స్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది.

ఈ తరహా నెగటివ్ ట్రోలింగ్స్ అనేది ఎవరికి ఉపయోగం లేనిది అని టాలెంట్ ఉంటే మళ్ళీ స్టార్స్ ఒక్కసారిగా బోన్స్ బ్యాక్ అవుతారు అని కూడా మరి కొందరు పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇక కృతి శెట్టి కూడా రాబోయే సినిమాలతో అలానే ట్రాక్ లోకి రావాలని మరికొందరు కోరుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.