Begin typing your search above and press return to search.

చిన్న గౌనులో ఉప్పెన పాప.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు

By:  Tupaki Desk   |   2 March 2023 10:19 AM GMT
చిన్న గౌనులో ఉప్పెన పాప.. ఎన్నాళ్ళకెన్నాళ్లకు
X
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడు మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వెంటనే నాగ చైతన్యకి జోడీగా బంగార్రాజు సినిమాలో ఈ బ్యూటీ ఆడిపాడింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో రామ్ కి జోడీగా ది వారియర్, నితిన్ కి జోడీగా మాచర్ల నియోజకవర్గం సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

అలాగే సుదీర్ బాబుకి జోడీగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ అనే సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలు పడేసరికి కృతిశెట్టి సోషల్ మీడియాలో కూడా కొంత వరకు సైలెంట్ అయ్యిందని చెప్పాలి. మరల ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది.

తాజాగా ఈ ఉప్పెన బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో అదిరిపోయే ఫోటోలని షేర్ చేసింది. చిన్న గౌను వేసుకొని ఢిల్లీలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అలా ఆహ్లాదంగా సేదతీరుతుంది. థైస్ అందాలు కనిపించే విధంగా ఈ అమ్మడు ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళకి సైగలు చేస్తున్న ఈ చిన్నది స్వేచ్చగా ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఆనందపరవశంలో తేలియాడుతుంది. దీనికి హ్యాపీ సండే అంటూ కృతి పాప క్యాప్షన్ పెట్టింది.

దీనిని బట్టి ఈ అమ్మడు ఆదివారం అలా ఢిల్లీలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోయిన కృతి శెట్టి మాత్రం సరదాగా దొరికిన టైమ్ ని ఎంజాయ్ చేస్తుందని ఈ ఫోటోల బట్టి తెలుస్తుంది.

ఇదిలా ఉంటే కస్టడీ పూర్తయిన తర్వాతనే నెక్స్ట్ సినిమా ఏదైనా కమిట్ అవ్వాలని కృతి శెట్టి ఆలోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కస్టడీలో ఈమె ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతుంది. దీని తర్వాత సూర్యకి జోడీగా ఒక తమిళ్ సినిమాకి కూడా కృతి శెట్టి కమిట్ అయినట్లు తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.