Begin typing your search above and press return to search.

ఉప్పెన : బేబమ్మని కూడా చూపించరా?

By:  Tupaki Desk   |   5 Feb 2020 2:30 PM GMT
ఉప్పెన : బేబమ్మని కూడా చూపించరా?
X
మెగా ఫ్యామిలీ కి చెందిన పంజా వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. అన్న సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటికే సుప్రీం హీరోగా పేరు దక్కించుకుని మామకు తగ్గ అల్లుడు అనిపించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇదే సమయంలో తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉప్పెన నుండి మొదటి వేవ్‌ ను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఇప్పటి వరకు ఈ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్‌ ఎలా ఉండబోతున్నాడు అనే విషయం పై పూర్తి క్లారిటీని ఇవ్వలేదు. హీరో ఫేస్‌ ను దాచేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం ఒక థీమ్‌ ను ఫాలో అవుతూ దాన్ని బట్టి ఫస్ట్‌ లుక్‌ మరియు ఇప్పుడు ఫస్ట్‌ వేవ్‌ ను విడుదల చేయడం జరిగింది. హీరోను మాత్రమే హైడ్‌ చేయకుండా హీరోయిన్‌ ను కూడా దాచి పెడుతున్నారు.

నేడు విడుదలైన ఫస్ట్‌ వేవ్‌ వీడియోలో హీరోయిన్‌ కృతి శెట్టిని కూడా పూర్తిగా చూపించకుండా హీరో కు మెయింటెన్‌ చేస్తున్న థీమ్‌ నే మెయింటెన్‌ చేశాడు. కాని హీరో బేబమ్మ అంటూ గట్టిగా అరవడం తో హీరోయిన్‌ పేరు బేబమ్మ అని తెలిసింది. మొత్తానికి హీరో హీరోయిన్‌ ఫేస్‌ లను హైడ్‌ చేస్తూ ఉప్పెన టీం చేస్తున్న ప్రమోషన్స్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌ లో అయినా వీరిద్దరి ఫేస్‌ లను పూర్తిగా చూపిస్తారా లేదా అనేది చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం స్క్రిప్ట్‌ వ్యవహారం లో సుకుమార్‌ భాగస్వామ్యం ఉన్నట్ లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.