Begin typing your search above and press return to search.
బేబమ్మ దేనికి భయపడుతుందో తెలుసా?
By: Tupaki Desk | 4 Jan 2022 2:30 AM GMTక్రితం ఏడాది వచ్చిన ప్రేమకథల్లో 'ఉప్పెన' ఫస్టు మార్కులు తెచ్చుకుందనే చెప్పాలి. ఈ సినిమాతోనే కృతి శెట్టి తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమాలో కథానాయకుడు తన ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తాడు. హీరో అంతలా తెగించడానికి ఆ అమ్మాయిలో ఏవుందని? అని ప్రేక్షకుడికి అనిపించకూడదు. అమ్మాయి అందంగా .. దానిమ్మ మొగ్గలా .. సంక్రాంతి ముగ్గులా ఉండాలి. అలాంటప్పుడే ఈ అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించడంలో అర్థం ఉందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. హీరోను సపోర్టు చేస్తూ ముందుకు వెళతారు.
అలా ప్రేక్షకులు కోరుకున్న అందచందాలతో .. సిగ్గు దొంతరలతో పంచదార చిలకలా ఈ సినిమాతో కృతి శెట్టి మెప్పించింది. మొదటి సినిమాతోనే అందరినీ తన అభిమానులుగా మార్చేసుకుంది. రెండవ సినిమా అయిన 'శ్యామ్ సింగ రాయ్'తోను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో పిల్లది గోల్డెన్ లెగ్గే అనిపించుకుంది. తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది. 'శ్యామ్ సింగ రాయ్' కథ వింటున్నప్పుడే ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు కుదిరింది. నానిగారి మాటల వలన ఆ నమ్మకం మరింత పెరిగింది.
ఇక ఎవరు ఎలాంటి కథను తీసుకొచ్చినా నేను మా అమ్మతో కలిసే వింటాను. కథ విషయంలో నా అభిప్రాయాన్ని నేను మా అమ్మకి చెబుతాను. అమ్మకి నచ్చితేనే చేస్తాను .. లేదంటే లేదు. నా మొదటి రెండు సినిమాలు బాగా ఆడటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ రెండు సినిమాల సమయాల్లోను నేను నాని నుంచి .. వైష్ణవ్ తేజ్ నుంచి చాలా నేర్చుకున్నాను. బేబమ్మ పాత్రకి దూరంగా ఉండే పాత్రలను చేయాలని అనుకున్నాను. ఆ సమయంలోనే నాకు 'శ్యామ్ సింగ రాయ్' నుంచి కీర్తి పాత్ర వచ్చింది. ఆ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఓకే చెప్పేశాను" అంటూ చెప్పుకొచ్చింది.
"ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయమంటూ ఉంటుంది .. అలా మీరు దేనికి భయపడతారు? ఏ విషయమై భయపడుతుంటారు? అనే ప్రశ్న కృతి శెట్టికి ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. "మొదటి నుంచి కూడా క్రింద పడిపోతానేమోననే భయం నాకు ఉంది. అందుకే చాలా నెమ్మదిగా .. జాగ్రత్తగా నడుస్తూ ఉంటాను. అందరూ కూడా నడక విషయంలో నన్ను టీజ్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నేను పడిపోవడం వల్లనేమో ఆ భయం అప్పటి నుంచి అలా ఉండిపోయింది. ప్రస్తుతం చేస్తున్నవన్నీ డిఫరెంట్ రోల్సే. అయితే యాక్షన్ సినిమాలో .. యాక్షన్ రోల్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. ఈ కోమలితో కొట్లాడటానికి ఎవరికి మాత్రం మనసొప్పుతుంది చెప్పండి?!