Begin typing your search above and press return to search.

బ్రూస్ లీ.. గబ్బర్‌.. ఇద్దరూ ఇద్దరే

By:  Tupaki Desk   |   14 Oct 2015 10:30 PM GMT
బ్రూస్ లీ.. గబ్బర్‌.. ఇద్దరూ ఇద్దరే
X
టాలీవుడ్ లో వారసుల హవా మొదలయ్యాక కూడా... సీనియర్లు ఇరగదీసేస్తున్నారు. ఓల్డేజ్ లో కూడా యంగ్ జనరేషన్ కి ధీటుగా లవ్ స్టోరీలు పండించడం మన హీరోస్ స్పెషాలిటీ. దీంతో రెండు తరాలకు చెందినోళ్లు.. చిందులేయడం చూసే ఛాన్స్ మనోళ్లకి వస్తోంది. ఇలాంటి రిలేషన్స్ లో బాబాయ్ - అబ్బాయ్ హీరోయిన్స్ ని పంచుకోక తప్పనిసరి అయిపోయంది. బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ . . వెంకీ -రాణా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇదే

వీళ్లు ఇప్పటికే తమన్నా - కాజల్ అగర్వాల్ లతో మూవీస్ చేశారు. ఇప్పుడీ జాబితా లోకి కృతి కర్బందా కూడా వచ్చి చేరింది. అయితే ఈ బాబాయ్ కి హీరోయిన్ అయితే.. అబ్బాయికి అక్కగా నటించడం విశేషం. ప్రస్తుతం బ్రూస్ లీ ప్రమోషన్స్ టాప్ గేర్ లో ఉన్నాయి. దీంతో కృతి కూడా తనకు తోచినంతగా ప్రచారంలో పాల్గొంటోంది. ఈ మూవీలో కృతి కేరక్టర్ చాలా కీలకం అని, హీరోయిన్ కి మించి ఇంపార్టెన్స్ ఉండే రోల్ అని చరణ్ స్వయంగా తనే చెప్పేశాడు. అంతే కాదు చరణ్ తో కలిసి నటించడం పై కూడా తన అనుభవాలను పంచుకుంటోంది కృతి. అదే టైంలో చెర్రీ బాబాయ్ పవన్ తోనూ తన రిలేషన్ నుంచి చెప్పుకొస్తోంది.

"పవన్ సెట్స్ పై చాలా సైలెంట్ గా ఉంటాడు. దీంతో చరణ్ కూడా అలాగే ఉంటాడని అనుకున్నా. ముందు పవర్ స్టార్ కంటే సైలెంట్ గా కనిపించిన చెర్రీ.. కో యాక్టర్స్ తో కాస్త ర్యాపో జనరేట్ అయ్యాక రెచ్చిపోతాడు. ఇక చెర్రీని ఆపడం ఎవరి వల్లా కాదు కూడా. అంత నాటీ బోయ్ చరణ్ " అంటోంది బ్రూస్ లీ సిస్టర్. సినిమాలో ఆ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ కారణంగానే సిస్టర్ రోల్ కి యాక్సెప్ట్ చేశానన్న క్రితి కర్బందా.. ఈ మూవీ తర్వాత తనకు టాలీవుడ్ లో మంచి పేరు రావడం ఖాయం అంటోంది.