Begin typing your search above and press return to search.

ఆ కుర్రాణ్ని లాక్ అప్ లో తోయించిన కృతి

By:  Tupaki Desk   |   18 Oct 2015 6:42 AM GMT
ఆ కుర్రాణ్ని లాక్ అప్ లో తోయించిన కృతి
X
మనుషులు పైకి ఒకలా కనిపిస్తారు. కానీ లోపల ప్రతి మనిషిలోనూ ఒరిజినల్ వేరే ఉంటుంది. దగ్గరగా గమనించినపుడే ఆ ఒరిజినల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఉదాహరణకు కృతి కర్బందానే చూడండి. అసలీ అమ్మాయికి కోపమనేదే రాదేమో అనిపిస్తుంది ముఖం చూస్తే. చూడ్డానికి అంత సాఫ్ట్గ్ గా ఉంటుందీ బ్యూటీ. కానీ అమ్మడికి ముక్కుమీదే ఉంటుందట కోపం. తనకు షార్ట్ టెంపర్ అని.. కోపం వచ్చిన పావు గంట పాటు తాను మనిషిలాగే ఉండనని అంటోంది కృతి. ఈ మధ్య అలా పిచ్చి కోపంతో ఓ కుర్రాడిని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లి లాక్ అప్ లో తోయించిన ఘటన గురించి గుర్తు చేసుకుంది కృతి.

‘‘నాకు షార్ట్ టెంపర్ అని చాలామందికి తెలియదు. కోపం వచ్చినపుడు పావు గంట పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తా. ఆ తర్వాత కూల్ అయిపోతారు. ఈ మధ్య బెంగళూరులో ఓ కుర్రాడు నా కారును ఢీకొట్టాడు. అతణ్ని అంత తేలిగ్గా వదల్లేదు. గట్టిగా అరిచి కోపం అతణ్ని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లా. కేసు పెట్టించి లాకప్ లో కూడా పెట్టించా. కానీ ఆ తర్వాత తొందరపడ్డానేమో అనిపించింది. బాధపడి.. అతణ్ని వదిలేయమని చెప్పా’’ అని చెప్పింది కృతి. ప్రస్తుతం తన కెరీర్ కన్నడ - తమిళం - తెలుగు భాషల్లో చాలా బాగా నడుస్తోందని.. ‘బ్రూస్ లీ’ సినిమాతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని.. తమిళంలోకి కూడా ‘బ్రూస్ లీ’ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం తనకే ఆశ్చర్యంగా ఉందని కృతి చెప్పింది.