Begin typing your search above and press return to search.
రకుల్ కన్నా కృతికే ఎక్కువ
By: Tupaki Desk | 3 Oct 2015 5:30 PM GMTసాధారణంగా ఓ హీరోయిన్ ఓ స్టార్ హీరోకు అక్క పాత్ర పోషించిందంటే ఇక కెరీర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే ఇలాంటి రోల్స్ చేయడానికి రెగ్యులర్ హీరోయిన్లు ఇష్టపడరు. ఐతే కృతి కర్బందా మాత్రం అలాంటి సాహసం చేసింది. బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ కు అక్కగా నటించడానికి ఒప్పేసుకుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్, రామ్ లాంటి హీరోల సరసన నటించిన కృతి ఇలా చేసిందేమిటా అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే తెలుగులో అన్నీ ఫ్లాపులే ఉండటంతో అవకాశం వచ్చింది చాల్లే అని ఒప్పేసుకుందేమో అంటూ సెటైర్లు వేశాడు.
ఐతే ‘బ్రూస్ లీ’ ట్రైలర్ చూశాక.. ఆడియో ఫంక్షన్లో రామ్ చరణ్ మాటలు విన్నాక.. కృతిది తెలివైన నిర్ణయమే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా అంతా అక్కా తమ్ముడు సెంటిమెంటు నేపథ్యంలోనే సాగుతుందని.. కృతి పాత్రే సినిమాకు చాలా కీలకం అని అర్థమవుతోంది. రామ్ చరణ్ కూడా అదే మాట చెబుతున్నాడు.. ‘‘బ్రూస్ లీ అక్కా తమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా. హీరోయిన్ క్యారెక్టర్ కంటే అక్క పాత్రే కీలకం. కృతి ఆ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుంది’’ అని చెప్పాడు. ట్రైలర్ చూస్తే హీరోయిన్ పాత్ర కేవలం పాటలకు కోసమే అని అర్థమవుతోంది. కాబట్టి బ్రూస్ లీ సినిమాలో రకుల్ కంటే కృతినే హైలైట్ అయ్యేలా ఉంది.