Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్.. వేదింపుల బాధితురాలట

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:38 PM GMT
పవన్ హీరోయిన్.. వేదింపుల బాధితురాలట
X
చాలావరకు సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్స్ ఎదగాలంటే లైంగిక వేధింపులను ఎదుర్కోక తప్పదని చాలా మంది ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ ఘటనలు ఎదురైన కొంత మంది సీనియర్ నటులు కూడా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని డైరెక్ట్ గా చెప్పేశారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో సీనియర్ హీరోయిన్స్ కూడా ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం హాలీవుడ్ లో హార్వే వీన్స్ టీన్ అనే ఒక ప్రముఖ నిర్మాత స్టార్ హీరోయిన్స్ ని చాలావరకు లైంగికంగా వేధించారనే వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇండియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం పై రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమాలో నటించిన కృతి కర్బందా కూడా ఎవరు ఊహించని విధంగా స్పందించింది. తాను కూడా మొదట్లో లైంగిక వేధింపులకు గురయ్యాను అనే విధంగా ''#మీటూ సాడ్.. బట్ ట్రూ''.. అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అందరిలానే తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని నిజమైన బాధతో ఆమె చెప్పడం చూస్తుంటే.. ఇండస్ట్రీలో నిజంగా ఇలాంటి దారుణాలు ఇంకా జరుగుతున్నాయా అని మనం ఆశ్చర్యపడుతూ బాధపడాల్సిందే. వీటిపై మరి ఇండస్ర్టీ పెద్దలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.