Begin typing your search above and press return to search.
టాలీవుడ్ నుండి వెళ్లిపోయాకే ఈ వయ్యారి దశ తిరిగిందట..!!
By: Tupaki Desk | 26 Dec 2020 5:30 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో పరాబాషా భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి కొందరు ఇక్కడే సెటిల్ అవుతారు. మరికొందరు కొద్దీ రోజులకే పెట్టాబేడా సర్దుకొని వేరే భాషలో సెటిల్ అవుతారు. తెలుగులో ఐదేళ్ల క్రితం కనిపించి మళ్ళీ ఇటువైపు రాలేదు ఢిల్లీ భామ కృతి కర్బందా. నిజానికి 2009లో బోణి అనే తెలుగు సినిమాతోనే తన కెరీర్ ప్రారంభించిన కృతి.. ఇంతవరకు తెలుగులో సరైన బోణి కొట్టలేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్, హీరో రామ్ సరసన 'ఒంగోలు గిత్త' సినిమాలో లంగావోణీ ధరించి మెప్పించింది కానీ హిట్ మాత్రం కొట్టలేదు. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు హీరోయిన్ గా చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసాయని చెప్పాలి. కృతి దగ్గర అందం, అభినయం ఉన్నా తెలుగు అభిమానుల మనసులు మాత్రం గెలవలేక పోయింది. అడపాదడపా సినిమాలలో కనిపించింది కానీ అమ్మడికి తెలుగులో హీరోయిన్ అవకాశాలు రాలేదు.
చివరిగా రాంచరణ్ 'బ్రూస్ లీ' సినిమాలో అక్కగా కనిపించింది. అదే లాస్ట్ ఇక.. మళ్ళీ తెలుగు వైపు తను రాలేదో లేక ఇక్కడి మేకర్స్ పిలవలేదో తెలియదు కానీ మొత్తానికి బాలీవుడ్ చెక్కెసింది. తెలుగులో ఎలాంటి హద్దులు పెట్టుకున్నా బాలీవుడ్ లో రాణించాలంటే మాత్రం అందాలకు హద్దులు చెరిపేయాలి. ఈ విషయం తెలుసుకొని కృతి అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకెళ్తుంది. ఇటీవలే హిందీలో కూడా పాగల్ పంతి, హౌస్ ఫుల్-4 సినిమాలతో హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉండటంతో అమ్మడు కాస్త ఫోటో షూట్ల పై ఫోకస్ పెడుతోంది. కానీ బాలీవుడ్ లో మాత్రం అమ్మడికి హిట్స్ పడుతున్నాయి. తెలుగులో కనీసం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదు. మొత్తానికి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది భామ. ప్రస్తుతం కృతి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయట. తైష్, వాన్, 14 ఫేరే సినిమాలతో బిజీగా ఉందట. అంతేగాక కో యాక్టర్ పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉందట కృతి. చెప్పాలంటే తెలుగు నుండి వెళ్లిపోయాకే అమ్మడి దశ తిరిగిందని ఇండస్ట్రీ టాక్.