Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఇది ఘాటు అందాల తీన్ మార్

By:  Tupaki Desk   |   8 July 2019 7:48 AM GMT
ఫోటో స్టొరీ: ఇది ఘాటు అందాల తీన్ మార్
X
కృతి కర్భందా తెలుసు కదా? సుమంత్ హీరోగా నటించిన 'బోణి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'.. రామ్ 'ఒంగోలు గిత్త' లాంటి సినిమాల్లో నటించింది. అయితే తను నటించిన సినిమాల్లో ఏవి కూడా సూపర్ హిట్లు కాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. మధ్యలో ఒకసారి చరణ్ సినిమా 'బ్రూస్ లీ' లో చరణ్ కు సోదరిగా నటించింది. ప్రస్తుతం కృతి ఫోకస్ అంతా బాలీవుడ్ మీదే. కొంచెం ఏదైనా ఫోకస్ మిగిలి ఉంటే అది సోషల్ మీడియాపైన పెట్టింది.

హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. రకరకాల టెన్షన్లతో బాధపడే నెటిజన్లకు ఉపశమనం కలిగిస్తూ.. అప్పుడప్పుడూ వారికీ టెంపరేచర్లు పెంచుతూ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాటు ఫోటోను పోస్ట్ చేసి ఒక డీప్ ఫిలాసఫీ చెప్పింది.."ఆమె కళ్ళల్లో ఒక కథ ఉంది.. చూడండి". పాపకేం.. ఏదైనా చెప్తుంది.. ఇక్కడ ఎవడి కథ వాడికి అర్థం కావడం లేదు. ఒక బ్యూటీ కళ్ళలోకి చూసి కథ అర్థం చేసుకోవాలట! అయినా కొంతమంది మేథావులకు ఆ కథలు చక్కగా అర్థం అవుతాయి. వారు అర్థం చేసుకోండి. మిగతావాళ్ళు మాత్రం హాటుగా ఉండే ఫోటోతో సరిపెట్టుకోండి. ఎందుకంటే షర్టు బొత్తాలు పెట్టుకోకుండా రత్తాలు టైపులో అందాలను వడ్డించింది కదా!

ఐస్ బ్లూ కలర్ షర్టు. అదే రంగులో ఉన్న టోర్న్ డెనిమ్ ప్యాంట్ తో స్టైలిష్ గా ఉంది. ఇక బ్లీచ్ చేసిన హెయిర్ తన హాట్నెస్ ను డబల్ చేసింది. కూర్చున్న పోజు.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ అన్నీ సూపర్. అందుకే నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "కళ్ళ సంగతి తెలీదు.. కథ సంగతి తెలీదు. మిగతా అంతా కనిపిస్తోంది".. "ఏక్ దమ్ ఝకాస్".. "నీ చిరిగిన జీన్సు నా మనసును చింపేసింది".. "నీ ఫోటో ఏంటి.. నీ క్యాప్షన్ ఏంటి?" అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక కృతి సినిమాల విషయానికి వస్తే 'హౌస్ ఫుల్ 4'.. 'పాగల్ పంటి'.. 'చెహెరే' అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో 'వాన్' అనే సినిమాలో కూడా నటిస్తోంది.