Begin typing your search above and press return to search.

ఒక్క‌ న‌వ్వుతో వెయ్యి దివ్వెలు వెలిగించిన ప‌వ‌న్ బ్యూటీ

By:  Tupaki Desk   |   5 Nov 2021 12:30 AM GMT
ఒక్క‌ న‌వ్వుతో వెయ్యి దివ్వెలు వెలిగించిన ప‌వ‌న్ బ్యూటీ
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న `తీన్ మార్` చిత్రంలో న‌టించింది కృతి క‌ర్భంద‌. జ‌యంత్.సి.ఫ‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. సుమంత్.. క‌ళ్యాణ్ రామ్ లాంటి స్టార్ల‌ స‌ర‌స‌న న‌టించింది. కానీ టాలీవుడ్ లో ఆశించిన స్టార్ డ‌మ్ ని అందుకోలేక‌పోయింది. మ‌ధ్య‌లో చ‌ర‌ణ్ `బ్రూస్ లీ` చిత్రంలో సిస్ట‌ర్ పాత్ర‌లో న‌టించినా అదీ కెరీర్ కి ఏమాత్రం క‌లిసి రాలేదు.

అదంతా గ‌తం అనుకుంటే ప్ర‌స్తుతం కృతి బాలీవుడ్ స‌హా త‌మిళం.. క‌న్న‌డ‌లో బిజీ బిజీ. హిందీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేనంత‌ బిజీగా ఉంది. కృతి న‌టించిన‌ భారీ మ‌ల్టీస్టార‌ర్ `హౌస్ ఫుల్ 4` త‌న‌కు గ్లామ‌ర‌స్ నాయిక‌గా గుర్తింపు తెచ్చింది. బాలీవుడ్ లోనే పాగ‌ల్ పానీ.. చెహ్రే లాంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. అనీల్ క‌పూర్- జాన్ అబ్ర‌హాం- అర్ష‌ద్ వార్షీ లాంటి స్టార్ల‌తో క‌లిసి `పాగ‌ల్ పానీ` లాంటి భారీ చిత్రంలో కృతి న‌టిస్తోంది. ఇక వీటితో పాటే త‌మిళంలో `వాన్` అనే చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. దుల్కార్ స‌ల్మాన్ - క‌ళ్యాణి ప్ర‌య‌ద‌ర్శిని ఈ చిత్రంలో నాయ‌కానాయిక‌లు. కృతి ఇందులో ఓ కీ రోల్ పోషించ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇంత బిజీగా ఉంటూనే నిరంత‌రం ఫోటోషూట్ల‌తోనూ సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ ట్రెడిష‌న‌ల్ లుక్ వైర‌ల్ గా మారింది. దీపావ‌ళి వేళ ఆ న‌వ్వుతోనే దివ్వెలు వెలిగించేసింది కృతి. చీర‌లో సాంప్ర‌దాయాన్ని తిరిగి తెచ్చినా హాట్ కంటెంట్ ని బోల్డ్ అప్పియ‌రెన్స్ ని మాత్రం విడిచిపెట్ట‌లేదు ఈ బ్యూటీ.