Begin typing your search above and press return to search.
ఫ్యూచర్ కోసం చరణ్ అక్క ఆన్సర్
By: Tupaki Desk | 4 Jun 2017 10:34 AM GMTఫెయిర్ నెస్ క్రీమ్స్ ప్రకటనలపై హీరోయిన్లు విభిన్నమైన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ తో ‘తీన్ మార్’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాల్లో నటించిన కృతి ఖర్బందా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చాలా బ్యాలెన్సెడ్ గా చెప్పింది. ‘గెస్ట్ ఇన్ లండన్’ లో నటిస్తున్న కృతి.. మూవీ ప్రచారంలో భాగంగా సినిమా విశేషాలతో పాటు.. ఫేస్ క్రీమ్ యాడ్స్ పై అలర్ట్ గా ఆన్సర్ చేసింది.
“క్రీమ్స్ గురించి చెప్పాలంటే.. నాకు నచ్చితే నేను వాడతాను.. అందులో తప్పేం ఉంది? మార్కెటింగ్ చేయడం తప్పు ఏమి లేదు. వాళ్ళు ఎలా చెబుతున్నారు అనేది ఇక్కడ అసలు సమస్య. దేవతలా ఉంటేనే పెళ్లి అవుతుంది. అందంగా లేకుంటే పెళ్లికాదు అని చెప్పడం తప్పు. మీ చర్మానికి అది ఉపయోగపడితే మీరు తప్పకుండా కొంటారు కదా? అలా అయితే.. మరి మేకప్ ప్రోడక్ట్స్ కూడా నిషేధించాలి కదా.. అవి మనకు నష్టం చేస్తాయని తెలిసినా ఎందుకు వాడుతున్నాం. యామి గౌతమ్ చేసిన యాడ్ చూశాను. అందులో నాకేమీ తప్పు కనిపించలేదు. మనం ఎలా ఉంటే బాగుంటుందో ఊహించుకుని.. అందుకు తగ్గట్లుగానే వాటిని వాడతాం. ఎవరినైనా తక్కువ చేయడం.. తప్పుడు ప్రచారం చేస్తే అభ్యంతరపెట్టాలి. అంతే తప్ప ప్రొడక్ట్ ని విమర్శించడం కాదు” అని కాస్త గట్టిగానే చెప్పింది బ్రూస్ లీ అక్క.
అంతేలే.. ఇప్పుడు విమర్శించేసి.. తర్వాత ఆ యాడ్స్ లో చేసే అవకాశాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు. అందుకే కర్ర విరక్కుండా.. పాము చావకుంజా జాగ్రత్త పడింది కృతి కర్బందా. ఇలాంటి సమాధానం వింటే.. అడగి తప్పు చేశామని అడిగినవాళ్లకు అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/