Begin typing your search above and press return to search.

వీడియో: కృతి క‌స‌ర‌త్తులు కిర్రాకే

By:  Tupaki Desk   |   18 May 2022 2:30 AM GMT
వీడియో: కృతి క‌స‌ర‌త్తులు కిర్రాకే
X
టాలీవుడ్ లో బోణీ.. తీన్ మార్ లాంటి చిత్రాల్లో న‌టించింది కృతి క‌ర్భందా. కానీ అవేవీ త‌న‌కు ఆశించిన హిట్టివ్వ‌లేదు. మైలేజ్ ని ఇవ్వ‌లేక‌పోయాయి. నిజానికి కృతి అంత‌కుముందే బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. విక్రమ్ భట్ హర్రర్ థ్రిల్లర్ రాజ్ రీబూట్ తో కృతి ఖర్బందా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ - గౌరవ్ అరోరా తారాగ‌ణం. తర్వాత గెస్ట్ ఇన్ లండన్- షాదీ మే జరూర్ ఆనా - పాగల్ పంథి వంటి కొన్ని చిత్రాలలో నటించింది.

ఇక కృతి ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ పెంచింది. ఈ వేదిక‌పై అప్పుడ‌ప్పుడు ఫిట్ నెస్ టిప్స్ కి ఉప‌క‌రించే కొన్ని వీడియోల‌ను కృతి షేర్ చేస్తోంది. తాజాగా కృతి షేర్ చేసిన ఓ వీడియో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ఇది చూసేందుకు ఎంతో సింపుల్ గా క‌నిపిస్తున్నా కానీ ప‌ర్ఫెక్ట్ రిజ‌ల్ట్ ఇచ్చే ఎక్స‌ర్ సైజ్ అని చెబుతోంది కృతి. ఈ వీడియోని ఫాలో చేస్తూ ఇలా ట్రై చేస్తే ఒత్తిడిని అధిగ‌మించొచ్చ‌ని కూడా వెల్ల‌డించింది.

ఇక కృతి కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు సంత‌కాలు చేసింది. ప్రముఖ పబ్లికేషన్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేయాలన్న‌ తన కోరికను బ‌హిర్గ‌తం చేసింది. ఖాన్ లతో కలిసి పనిచేయడం నా బకెట్ లిస్ట్ లో ఒక విష్ అని .. షారూఖ్ ఖాన్ తో ఒక ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నానని కృతి తెలిపింది.

``ఖాన్ లతో కలిసి పనిచేయాల‌న్న కోరిక క‌చ్చితంగా నా బకెట్ లిస్ట్ లో ఉంది. నేను ఏదో ఒక రోజు దీనిని సాధిస్తాను. దానిపై నాకు ఎటువంటి సందేహం లేదు. ఎదిగే క్ర‌మంలో షారుఖ్ ఖాన్ ను నేను ఎక్కువగా అభిమానించే వీరాభిమానిని. నేను క‌చ్ లో ఉన్న‌పుడు పాఠశాల స్ట‌డీస్ లో ఉన్నాననేది నాకు గుర్తుంది. అప్ప‌ట్లోనే కుచ్ కుచ్ హోతా హై విడుదలైంది. ఆ సినిమాలో చూపించిన పాపుల‌ర్ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ని నేను మా స్కూల్ బయట కొనుక్కున్నాను. ఒక సంవత్సరం పాటు దానిని ధరించాను. షారూఖ్ సర్ తో ఓ చిత్రంలో నటించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను.. త‌న‌తో పాట‌ల‌కు డ్యాన్సులు చేయాలని కృతి త‌న క‌ల‌ను తెలిపింది.

గత ఏడాది బెంగళూరులో తన కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తూ గ‌డిపేసాన‌ని వెల్లడించింది. ``మాది సినిమా హాళ్లలో సినిమాలు చూడటానికి ఆదివారాలను అంకితం చేసే కుటుంబం. కాబట్టి మా నాన్న లాక్డౌన్ సమయంలో ఒక ప్రొజెక్టర్ - భారీ స్క్రీన్ ని కొనేసారు. తద్వారా అతను ఇంట్లో థియేట్రికల్ అనుభూతిని పొందగలడు. అతను ఇదంతా సెట్ చేసాడు. మా ఇంటి టెర్రస్ లో.. మేము సినిమా రాత్రులు సరదాగా గడిపాము. ఈ కొన్ని రోజులు నేను నా తల్లిదండ్రులు తోబుట్టువులతో కొంత విలువైన సమయాన్ని గడిపాను. ప్రపంచం గురించి నేను అస్స‌లు చింతించలేదు... అని తెలిపింది. కెరీర్ మ్యాట‌ర్ మాట్లాడుతూ.. కృతి చివరిగా 14 ఫేరేలో విక్రాంత్ మాస్సేతో కలిసి కనిపించింది.