Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఇంతందం అడ‌విగాచిన వెన్నెలేనా?

By:  Tupaki Desk   |   1 March 2023 8:00 AM GMT
ఫోటో స్టోరి: ఇంతందం అడ‌విగాచిన వెన్నెలేనా?
X
కృతి క‌ర్భంద ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందానికి అందం ప్ర‌తిభ ఉన్న ఈ బ్యూటీ తెలుగు-త‌మిళం-క‌న్న‌డం-హిందీ భాష‌ల్లో న‌టించింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న 'తీన్ మార్' చిత్రంలో న‌టించింది కృతి.

జ‌యంత్.సి.ఫ‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం అందుకోలేదు. సుమంత్.. క‌ళ్యాణ్ రామ్ లాంటి స్టార్ల‌ స‌ర‌స‌న న‌టించినా ఫ‌లితం తిర‌కాసు అయ్యింది. చివ‌రిగా చ‌ర‌ణ్ 'బ్రూస్ లీ' చిత్రంలో సిస్ట‌ర్ పాత్ర‌లో న‌టించినా అదీ కెరీర్ కి క‌లిసి రాలేదు.

అందాల కృతి బాలీవుడ్ లోను ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించింది. భారీ మ‌ల్టీస్టార‌ర్ హౌస్ ఫుల్ 4 -పాగ‌ల్ పానీ.. చెహ్రే లాంటి భారీ చిత్రాల్లో న‌టించింది. త‌మిళంలో 'వాన్' అనే చిత్రంలోనూ నాయిక‌గా న‌టించింది. తానిష్ - 14 పేరే లాంటి చిత్రాల‌లో చివ‌రిగా న‌టించింది. అయితే వీటిలో ఏవీ త‌న‌కు ల‌క్ ఫేవ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో కెరీర్ ప‌రంగా అవ‌కాశాలు త‌గ్గాయి. ఈ తీరిక స‌మ‌యంలో కృతి ఇటీవ‌ల పోల్ డ్యాన్స్ లోను నైపుణ్యం సంపాదించింది.

ప్ర‌స్తుతం కెరీర్ జోరు త‌గ్గినా నిరంత‌రం ఫోటోషూట్ల‌తోనూ సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఓ హాట్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. కృతి సింపుల్ ఫ్లోర‌ల్ ఫ్రాక్ లో ఎంతో క్యాజువ‌ల్ గా క‌నిపిస్తున్నా త‌న‌లోని వాడి వేడి ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని యువ‌త‌రం గుర్తిస్తోంది.

డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లో మునుముందు ఈ భామ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కే ఛాన్సుంది. ప్ర‌స్తుతం ఓటీటీదే హ‌వా కాబ‌ట్టి అందాల భామ‌ల‌కు అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. కృతి కంబ్యాక్ ఎలా ఉండ‌బోతోందో వేచి చూడాలి.

వ్యక్తిగత జీవితంలో ల‌వ్ క‌హానీ

కృతి క‌ర్బందా స‌హనటుడు పుల్కిత్ సామ్రాట్ తో డేటింగ్ చేస్తోంద‌ని క‌థ‌నాలొచ్చాయి. వీరే కి వెడ్డింగ్- పాగల్‌పంతి -తాయిష్ చిత్రాల‌లో పుల్కిత్ కృతికి సహనటుడు. ఈ జంట‌ 2019 నుండి రిలేష‌న్ షిప్ లో ఉన్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే అధికారికంగా ఈ జంట దేనినీ ధృవీక‌రించ‌లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.