Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎల్లోరా శిల్ప‌మా.. గుండెల్లో గున‌ప‌మా?

By:  Tupaki Desk   |   25 April 2023 9:45 AM GMT
ఫోటో స్టోరి: ఎల్లోరా శిల్ప‌మా.. గుండెల్లో గున‌ప‌మా?
X
కృతి క‌ర్భంద ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అందం అభినయం ఉన్నా స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్కినా ఇవేవీ త‌న‌ని ఆదుకోలేదు. ద‌క్షిణాదిన కొన్ని వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చినా త‌న స్టార్ డ‌మ్ ని పెంచ‌డానికి ఇవి స‌హ‌క‌రించ‌లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'తీన్ మార్' చిత్రంతో కృతి క‌ర్భంద‌కు గుర్తింపు ద‌క్కినా అవ‌కాశాలు మాత్రం రాలేదు. అదే క్ర‌మంలో కృతి ఇరుగు పొరుగు భాష‌ల్లో న‌టించేందుకు బేస్ క్యాంప్ మార్చింది. బాలీవుడ్ లో ట్రై చేసినా కెరీర్ ఆశించినంత రేంజుకు చేర‌లేదు. పంజాబీ- త‌మిళం- క‌న్న‌డ‌-మ‌ల‌యాళంలోనూ న‌టించింది. ఇప్ప‌టికే 12ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ ఇక‌పైనా స్టార్ గా వెల‌గాల‌ని ఆశిస్తోంది. కానీ త‌న‌కు ఆశించిన ఛాన్సులైతే రావ‌డం లేదు.

స‌హ‌న‌టుడితో ప్రేమాయ‌ణం:

ఇటీవ‌ బాలీవుడ్ యువ‌న‌టుడు పుల్కిత్ సామ్రాట్ తో నిండా ప్రేమ‌లో ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ జంట నిరంత‌ర షికార్లు బాలీవుడ్ మీడియాలో హెడ్ లైన్స్ లోకొచ్చాయి. వీరే కి వెడ్డింగ్-పాగల్‌పంటి-తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించిన లవ్ బర్డ్స్ 2019లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

అప్పటి నుండి నటీనటులు ఇద్దరూ తమ రిలేషన్ షిప్ విష‌యంలో మరింత దృఢంగా మారారు. బెంగుళూరు మిర్రర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పుల్కిత్ ను నిజాయితీ ప‌రుడైన వ్యక్తి అంటూ అభివ‌ర్ణించింది. ఒకటిన్నర సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాం.పెళ్లి గురించి చర్చించలేదు. వెంట‌నే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదు. మేము ప్రస్తుతం మా కెరీర్ పై దృష్టి పెడుతున్నాము. పెళ్లి సుదూర స్వప్నం... అంటూ ఫుల్ క్లారిటీగా చెప్పేసింది.

కాస్ట్ లీ కానుక‌ల‌తో జోష్‌:

బాలీవుడ్ ప్రముఖులు విలాసవంతమైన జీవితాలకు ఏమాత్రం త‌గ్గ‌కుండా కృతి ఇటీవ‌ల కాస్ట్ లీ లైఫ్ ని లీడ్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. కృతి ఖర్బందా ఇటీవ‌ల‌ తనకొక కొత్త కారును బహుమతిగా ఇచ్చుకుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ 2.0 ఆర్-డైనమిక్ ఎస్ డీజిల్ వెర్ష‌న్ ని సొంతం చేసుకుంది. ఈ కార్ లో తన బోయ్ ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి షికార్లు చేసింది. ఈ కారు ధర రూ. సుమారు 89.41 లక్షలు. కృతి తన కారును కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2017లో తన తల్లిదండ్రులకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చింది.

వ‌రుస ఫోటోషూట్లతో హ‌ల్చ‌ల్:

కృతి క‌ర్భంద ప్ర‌స్తుతం ఇన్ స్టాలో ఫోటోలు వీడియోల‌తో ఫాలోవ‌ర్స్ ని పెంచుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల‌ పోల్ డ్యాన్స్ తో ఇంటర్నెట్ ని షేర్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ పుల్కిత్ సామ్రాట్ ఆ దృశ్యాల‌కు 'ఫ్యాబులస్' అంటూ కితాబిచ్చాడు. తాజాగా మ‌రోసారి ప‌సుపు ప‌చ్చ చీర‌లో కృతి క్లాసీ లుక్ కుర్ర‌కారులో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోషూట్ వీక్షించ‌గానే యూత్ ఎల్లోరా శిల్ప‌మా అంటూ పొగిడేస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హౌస్ ఫుల్ 4 .. పాగ‌ల్ పంటి చిత్రాల్లో కృతి న‌టించింది. కృతి చివరిసారిగా 14 ఫేరేలో విక్రాంత్ మాస్సేతో కలిసి కనిపించింది. అలోన్ సినిమాతో ఆమె మలయాళంలో అరంగేట్రం చేసింది. 2020లో థైష్ చిత్రంలోను న‌టిస్తోంది. దుల్కార్ స‌ర‌స‌న వాన్ అనే రోడ్ ట్రిప్ మూవీలో న‌టిస్తోంది. జీస్టూడియోస్ 14 పెరే అనే కామెడీ డ్రామాలోనూ న‌టిస్తోంది.